బాలీవుడ్ నటుడు  జాకీ ష్రాఫ్ తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి సుపరిచితమే. ఆ మద్య పవన్ కళ్యాన్ నటించిని ‘పంజా’ సినిమాలో నటించారు. సినిమా తెరపై ఎంతో మంది హీరోలు తమ హీరోయిజాన్ని చూపిస్తుంటారు. కాని నిజజీవితంలో మాత్రం అలాంటికి చాలా రేర్ గా కనిపిస్తుంటాయి.  తాజాగా హీరో  జాకీ ష్రాఫ్ గజిబిజిగా ఉన్న ట్రాఫిక్ ను స్వయంగా తానే క్లియర్ చేసి అందరికీ టాటా చెప్పి వెళ్లారు. 

Image result for జాకీ ష్రాఫ్ ట్రాఫిక్ జామ్

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిందీ ఘటన. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ట్రాఫిక్ జామ్‌తో జనాలు ఇబ్బంది పడుతుంటే కారులో వున్న బాలీవుడ్ సీనియర్ హీరో జాకీష్రాఫ్ కారు దిగి ట్రాఫిక్ క్లియర్ చేశాడు. 61 ఏళ్ల ఈ నటుడు కారు దిగి...వెహికల్స్ దారి మళ్లిస్తూ బిజీగా కనిపించాడు. మొత్తానికి ఏదోలా అక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా చేసాడు.జాకీ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తుండగా వీడియో తీసిన అభిమానులు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. లక్నోలో ఓ షూటింగ్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. 

Video : రియల్ హీరో అనిపించుకున్న జాకీష్రాఫ్

వీడియోను చూసిన వారు జాకీని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి జాకీ చేసిన ఈ మంచి పనిని చూసి సాధారణ ప్రజలతో పాటు నెటిజన్స్ వరకు అందరు ప్రశంసిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయితే ఎవరికి వారే తలలు పట్టుకొని కూర్చోవడమో..ఒకరిని ఒకరు దూషించుకోవడమే చేస్తుంటారు. కానీ ఒక సెలబ్రెటీ అయి ఉండి కూడా జాకీష్రాఫ్ స్వయంగా కారు దిగి ట్రాఫిక్ క్లీయర్ చేయడం చూసి ఎంతో మంది జ్ఞానం తెచ్చుకోవాలని అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: