లవర్ బోయ్ నితిన్ హీరోగా శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీనివాస కళ్యాణం. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కే ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిందని తెలిసిందే. ఆగష్టు 9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పెళ్లి ప్రాముఖ్యతను తెలుపనుందట.


సినిమా టీజర్ ఇంప్రెసివ్ గా అనిపించింది. అమ్మాయిలే అబ్బాయిలకు ముద్దొస్తారా.. అబ్బాయిలు కూడా అమ్మాయిలకు ముద్దొస్తారని డైలాగ్ ఇంప్రెస్ చేసింది. ఇక ఈ సినిమా ఆడియో వేడుకలో ప్రతి కుటుంబంలో జరిగే సన్నివేశాలతోనే ఈ సినిమా తెరకెక్కించాం అని.. ఇది నా కథ.. మీ కథ.. మన అందరి కథ అని అన్నారు.


సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న కూడా సినిమా ఫ్యామిలీ మొత్తం హాయిగా చూసే సినిమా అని అన్నారు. ఇక సినిమా క్లైమాక్స్ లో నితిన్ నటన అదరగొట్టాడని. క్లైమాక్స్ 5 నిమిషాలు నితిన్ నే చూస్తామని అన్నారు. సో దర్శకుడు సతీష్ చెప్పిన మాటలని బట్టి చూస్తే నితిన్ ఈ సినిమాలో విశ్వరూపం చూపించాడని అనిపిస్తుంది. 


సినిమాలో రాశి ఖన్నా కూడా చాలా క్యూట్ గా కనిపిస్తుంది. అఆ తర్వాత లై, ఛల్ మోహన్ రంగ ఫ్లాపులు అవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నాడు నితిన్. మరి ఈ శ్రీనివాస కళ్యాణం ఆ హిట్ కల నెరవేరుస్తుందో లేదో చూడాలి. చిత్రయూనిట్ మాత్రం ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: