‘శ్రీనివాసకల్యాణం’ సక్సస్ పై రాశి ఖన్నా ఎన్నో ఆశలు పెట్టుకుంటే దానికి భిన్నంగా ఈమూవీ ఇంకా విడుదల కాకుండానే రాశి ఖన్నా తల్లికి కంట కన్నీరు పెట్టించడం ఆశ్చర్యంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ రాశి ఖన్నా మొన్న జరిగిన ఈమూవీ ఆడియో ఫంక్షన్ లో చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచింది. 
పెళ్లికూతురుగా రాశీ ఖన్నా.. ఎంత సక్కగుందో..!
అచ్చ తెలుగు సంస్కృతీ సాంప్రదాయాల నేపథ్యంలో పెళ్లిలోని విశిష్టతను గొప్పదనాన్ని తెలియజేసే కథతో తీయబడ్డ ఈమూవీ కథను దర్శకుడు సతీష్ వేగేశ్న చెప్పిన వెంటనే ఓకే చెప్పేశానని రాశి ఖన్నా కామెంట్ చేసింది. అంతేకాదు ఈకథ తనకు బాగా నచ్చడంతో తన ఇంటికి వెళ్ళి తన తల్లికి ఈ మూవీ కథ చెప్పినప్పుడు తన తల్లి కళ్ళల్లో నీళ్లు తిరగడం తనకు ఇంకా గుర్తుంది అంటూ రాశి కామెంట్స్ చేసింది.
పెళ్లికూతురుగా రాశీ ఖన్నా.. ఎంత సక్కగుందో..!
వాస్తవానికి ఈ సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న ముందు హీరోయిన్‌ గా రాశి ఖన్నాని అనుకోలేదట. నిర్మాత దిల్ రాజు ఆమె పేరు సూచిస్తే వద్దని చెప్పాడట. అయితే ఆమె నటించిన ‘తొలిప్రేమ’ సినిమా చూసిన తరువాత రాశి పై తన అభిప్రాయం మార్చుకున్నాను అని అంటున్నాడు దర్శకుడు. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలకు పరిమితం అయిపోయిన రాశిలో ఎంత మంచి నటి ఉందనే విషయం ఈమధ్యనే విడుదలైన ‘తొలిప్రేమ’ ద్వారా తెలియడంతో ఆమెకు నటించే అవకాసం ఉన్న పాత్రలను ఇవ్వడానికి దర్శకులు ప్రయత్నిస్తున్నారు. 
పెళ్లికూతురుగా రాశీ ఖన్నా.. ఎంత సక్కగుందో..!
దీనికితోడు రాశి ఖన్నా తాను నటించే పాత్రల విషయంలో పరిణితి వచ్చింది అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.  ‘శ్రీనివాసకల్యాణం’ అనుకున్న విధంగా విజయం సాధిస్తే మెచ్యూర్డ్ హీరోయిన్ గా రాశి ఖన్నా పరిగణింపబడి మరిన్ని మంచి అవకాశాలు వచ్చే చాన్స్ ఉంది అని అంటున్నారు. ‘శ్రీనివాసకళ్యాణం’ సినిమా కోసం రాశి తన మేనేజర్లని దిల్ రాజు ఆఫీసులో కూర్చోబెట్టి మరీ  అవకాశాన్ని సంపాధించుకుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈమూవీ సక్సస్ ఈమె కెరియర్ కు అత్యంత కీలకం..   


మరింత సమాచారం తెలుసుకోండి: