తెలుగు ఇండస్ట్రీలో  అందం, అభినయంతో ప్రేక్షుకులని కట్టిపడేయగల సుందరి అమలాపాల్. తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో, బెజవాడ వంటి చిత్రాల్లో నటించింది. మొదటి నుంచి  వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న అమలాపాల్ ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ లో బిజీగా ఉంది.  భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు అప్పట్లో గ్లామర్ పాత్రలకు కూడా సై అంటూ వచ్చింది.  అమలాపాల్ సినీజీవితంలో, వ్యక్తిగత జీవితంలో కూడా వివాదాలు చెలరేగాయి.

కానీ వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కొంటూ సినిమాల్లో నటిస్తోంది. తాజగా తనకు వచ్చిన కొన్ని బాలీవుడ్ అవకాశాలపై అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ర్జున్ రాంపాల్ హీరోగా నరేష్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఈ సందర్భంగా తనకు గతంలో వచ్చిన బాలీవుడ్ ఆఫర్ల గురించి మాట్లాడుతూ..గతంలో హిందీ సినిమాలో నటించే అవకాశాలు వచ్చాయి. 
Image result for amala paul bikini
అయితే వాళ్ళు కొన్ని సీన్లలో బికినీ వేసుకోమని చెప్పారు.. అది నాకు నచ్చలేదు దాంతో  వాళ్ళకి మొహం మీదే 'నో' చెప్పానని తెలిపింది.  తనకు బికినీ వేసుకోవడానికి అభ్యంతరం లేదట కానీ చెత్త సన్నివేశాల్లో బికినీ వేసుకోమని చెప్పడంతో చిర్రెత్తుకొచ్చి ఆ ఆఫర్లు రిజెక్ట్ చేశాని చెప్పింది.  మరి అంతగా ఈ అమ్మడికి ఆ బికినీ సీన్ల గురించి ఏం చెప్పారో కాని మొత్తానికి నో అని చెప్పిందట పాపం. 


మరింత సమాచారం తెలుసుకోండి: