సినిమాలను రాజకీయాలను సెంటిమెంట్స్ ప్రభావితం చేసినవిధంగా మరి ఏఇతర రంగంలోను ఇంత భారీ స్థాయిలో సెంటిమెంట్స్ కనిపించవు. ఇండస్ట్రీలోని ప్రతిహీరో తమకు బాగా కలిసివచ్చే తేది  లేదంటే నెలలో తమ సినిమాలు విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది అనాదిగా కొనసాగుతున్న సాంప్రదాయమే. 
Mahesh Babu ‘Bharat Ane Nenu’ Movie Updates
స్టార్ హీరోల్లో మహేష్ బాబు ఇలాంటి  సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతాడని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ సెంటిమెంట్స్ కారణంగానే మహేష్ తన సినిమాలకు ఎప్పుడూ మూడక్షరాల పేర్లనే పెట్టడానికి ముచ్చట పడుతూ ఉంటాడు. మహేష్ సినీ కెరియర్ లో    బ్లాక్ బస్టర్స్ అన్నీ మూడక్షరాల పేర్లే ‘మురారీ’ ‘అతడు’ ‘పోకిరి’ ‘దూకుడు’ ఇలా మూడు అక్షరాల పేర్లు మహేష్ కు బాగా కలసివచ్చాయి. 
Mahesh Babu Latest Interview Photos09
అవకాసం వస్తే చాలు ఇప్పటికీ తన సినిమాలకు మూడు అక్షరాల టైటిల్ ఆలోచించమని మహేష్ తన దర్శకులకు చెపుతూనే ఉంటాడు అన్న వార్తలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా వంశీ పైడిపల్లి సినిమాలో క్యారెక్టర్ డిమాండ్ చేయడంతో గడ్డంపెంచి కనపడడానికి మహేష్ అనేకసార్లు ఆలోచనలు చేయడం వెనుక కూడా ఒక సెంటి మెంట్ ఉంది అంటారు. గడ్డం పెంచితే తనకు కలిసిరాదనే అపోహ మహేష్ లో ఉందట.   గతంలో గడ్డం పెంచి తీసిన ‘టక్కరిదొంగ’ మూవీ మహేష్ కెరీర్ లో అతిపెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా మారిన నేపధ్యంలో గడ్డంతో కూడిన పాత్ర అంటే మహేష్ హడలిపోతాడు అని టాక్.

ఈ  విషయంలో తనకు ఉన్న సెంటిమెంట్ భయం మహేష్ దర్శకుడు వంశీ  పైడి పలికి వివరించినా ఆ దర్శకుడు లైట్ గా తీసుకోవడంతో పాటు   గడ్డం పెంచాలని రిక్వెస్ట్ చేయడంతో మహేష్ అయిష్టం గానే తన లేటెస్ట్ మూవీకోసం గెడ్డం పెంచాడు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కధలో మహేష్ కు కొంత అసంతృప్తి ఉంది అని జరుగుతున్న ప్రచారంతో పాటు మహేష్ సెంటిమెంట్ కూడ లేటెస్ట్ గా బయటకు రావడంతో ఈ మూవీ రిజల్ట్ పై మహేష్ సెంటిమెంట్ ప్రభావం చూపుతుందా అన్న ప్రచారం జరుగుతోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: