మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో వచ్చిన సినిమా తేజ్ ఐలవ్యూ. కె.ఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమా సాయి ధరం తేజ్ వరుస ఫ్లాపుల బ్యాడ్ లక్ ను కొనసాగిస్తుంది. తిక్క నుండి ఇంటిలిజెంట్ వరకు వరుసగా ఐదు ఫ్లాపులు ఎదుర్కున్న సాయి ధరం తేజ్ తాజాగా వచ్చిన తేజ్ ఐలవ్యూతో కూడా తన ఖాతాలో మరో ఫ్లాప్ వేసుకున్నాడు.


సినిమా అంచనాలు బాగానే ఉన్నా తేజ్ ఇదవరకు సినిమాల ప్రభావం వల్ల కేవలం 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా రిలీజ్ చేశారు. కాని ఈ సినిమా లాంగ్ రన్ లో 4 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. తేజూ కెరియర్ లో డిజాస్టర్ సినిమాగా తేజ్ ఐలవ్యూ కలక్షన్స్ ఉన్నాయి.


కరుణాకరణ్, మెగా హీరో కలిసి చేసే సినిమా అంటే తొలిప్రేమ రేంజ్ సినిమా ఊహించిన మెగా అభిమానులకు ఈ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. రొటీన్ కథ, కథనాలతో వచ్చిన ఈ మూవీ ఈ ఇయర్ వచ్చిన డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. మరి ఏరియాల వారిగా ఈ సినిమా కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..


నైజాం : 0.80 కోట్లు
సీడెడ్ : 0.70 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.60 కోట్లు
ఈస్ట్ : 0.34 కోట్లు
వెస్ట్ : 0.33 కోట్లు
గుంటూరు : 0.42 కోట్లు
కృష్ణా : 0.37 కోట్లు
నెల్లూరు : 0.16 కోట్లు
ఏపి/తెలంగాణా : 3.72 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 కోట్లు
ఓవర్సీస్ 0.20 కోట్లు
వరల్డ్ వైడ్ : 4.22 కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: