సినిమా ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తమతో నటించిన హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకోవడమో..లేదంటే మంచి బిజినెస్ మాన్స్ ని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవడమో జరుగుతుంది.  ఇలా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న పరంపర అని చెప్పొచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘హ్యాపీడేస్’సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మిల్కీబ్యూటీ తమన్నా తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా పేరు తీసుకు రాలేదు.  దాంతో ఈ అమ్మడు ఐటమ్ సాంగ్స్ లో సైతం నటించి తన కెరీర్ కొనసాగిస్తూ వచ్చింది.   

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్నతమన్న బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.   ప్రభుదేవ దర్శకత్వంలో వచ్చిన అభినేత్రి కాస్త పరవాలేదు అనిపించింది.  తాజాగా మిల్కీ బ్యూటీ కూడా ఇదే దారిలో పోతుంది కాకపోతే పెళ్లి కొడుకు  హీరోనో కాదు ఓ ఎన్ ఆర్ ఐ డాక్టర్ అని తెలుస్తుంది.  పైగా అక్కడ పెళ్లి కొడుక్కి చాలా వ్యాపారాలు ఉన్నాయట.

త్వరలోనే ఈ జంట ఒక్కటవనున్నారు. నిశ్చితార్ధానికి కూడా ముహూర్తాలు చూస్తున్నారని సమాచారం.  మరి పెళ్లి చేసుకున్న తర్వాత తమన్నా సినిమాల్లో కంటిన్యూ చేస్తుందా..లేక కూల్ గా ఎన్ఆర్ఐ భర్తలో అమెరికాలో సెటిల్ అయిపోతుందా అనేది వేచి చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: