నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో సినిమా ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. మొదటి సీజన్ లో కూడా ఈ ప్రమోషన్స్ జరిగాయి. అయితే మొదటి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లోకి ప్రమోషన్స్ కు వెళ్లిన సినిమాలు మంచి ఫలితాలు అందుకున్నాయి. ఒకటి అరా తప్ప బిగ్ బాస్ ప్రమోషన్స్ లాస్ట్ ఇయర్ మంచి సక్సెస్ అయ్యాయి.


అయితే ఈ సీజన్ లో బిగ్ బాస్ లోకి ప్రమోషన్స్ కు వెళ్లిన ఏ సినిమా ఇప్పటివరకు సక్సెస్ అవ్వలేదు. బిగ్ బాస్-2 సినిమా వాళ్లకు బ్యాడ్ సెంటిమెంట్ అయ్యిందని అంటున్నారు. మొదటి సీజన్ లో సినిమా ప్రమోషన్స్ కు వచ్చిన వారిలో రానా (నేనే రాజు నేనే మంత్రి), విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి), తాప్సి (ఆనందో బ్రహ్మ), ఎన్.టి.ఆర్ (జైలవకుశ) హిట్ అందుకున్నాయి. 


అదే సీజన్ లో నరేష్ (మేడ మీద అబ్బాయి), సునీల్ (ఉంగరాల రాంబాబు) ప్రమోట్ చేసినా అవి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ సీజన్ లో శ్రీనివాస్ రెడ్డి జంబలకిడి పంబ మూవీతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అది ఫ్లాప్ అవగా.. ఆ తర్వాత సాయి ధరం తేజ్ నటించిన తేజ్ ఐలవ్యూ కూడా ప్రమోట్ చేయగా అది తుస్సుమన్నది. ఇక రీసెంట్ గా మంచు లక్ష్మి బిగ్ బాస్ హౌజ్ లో సందడి చేయగా ఆమె నటించిన వైఫ్ ఆఫ్ రామ్ కూడా అంతగా మెప్పించలేదు.


మొత్తానికి బిగ్ బాస్ ఈ సీజన్ సినిమా ప్రమోషన్స్ కు బ్యాడ్ సెంటిమెంట్ గా మారింది. మరి ఈ వారం సినిమాల్లో అయినా బిగ్ బాస్ ప్రమోషన్స్ కూడా చేసుకుని హిట్ అయితే ఆ టాక్ మారే అవకాశం ఉంది. ఈ వారం నిహారిక హ్యాపీ వెడ్డింగ్, బెల్లంకొండ సాక్ష్యం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: