సామాన్యంగా హీరోలు జేమ్స్ బాండ్ అవతారాలు ఎత్తుతూ ఉంటారు. కాని నిర్మాత జేమ్స్ బాండ్ లుక్ లో ఉండడం అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయమే. 50 సంవత్సరాలుగా హాలీవుడ్ సినిమాను ఏలిన జేమ్స్ బాండ్ గెటప్ తో అనేక సినిమాలు వచ్చాయి. జేమ్స్ బాండ్ హెయిర్ స్టైల్, డ్రెస్, గ్యాడ్జట్స్ అన్నీ విభిన్నంగా ఉంటాయి. అందుకే ఆ లుక్ అంటే ప్రపంచ సినిమా రంగంలోని అందరి హీరోలకు మోజు. మరి ఇదే మోజు మన ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కు కూడా ఉంది కాబోలు అందుకే అతడు జేమ్స్ బాండ్ గెటప్ లో తన సొంత సినిమా ఆడియో ఫంక్షన్ కు పై ఫోటోలో కనిపిస్తున్నట్లుగా వెరైటీ గెటప్ తో తన భార్య తో సహ వచ్చాడు. ఇంతకీ ఆయన ఎవరు అంటే లగడపాటి శ్రీధర్.

తన తండ్రి రాజకీయాలలో వెరైటీ స్టేట్మెంట్స్ తో అధరగోడుతూ ఉంటే తాను మాత్రం ఏమి తక్కువ కాను అంటూ గ్రే కలర్ సూట్ తో, కలర్ గాగుల్స్ పెట్టుకొని, కోటు పాకెట్ లో  రెడ్ కర్చీఫ్ పెట్టుకొని నిజమైన జేమ్స్ బాండ్ లా తాను మంచు మనోజ్ హీరోగా నిర్మిస్తున్న ‘పోటుగాడు’ ఆడియో ఫంక్షన్ కు రావడం అందరినీ ఆశ్చర్య పరచింది. ఒక కన్నడ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ తో ఏకంగా నలుగురు హీరోయిన్స్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని అటు మనోజ్ ఇటు లగడపాటి శ్రీధర్ లు పెద్ద పెద్ద కలలు కంటున్నారట. ప్రేక్షకులు ఏమి తీర్పు ఇస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: