బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన వారిని మళ్లీ ఓటింగ్ ద్వారా హౌజ్ లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వారం ఎలిమినేషన్ కు బదులుగా ఇంట్లోకి ఎలిమినేట్ అయిన సభ్యుడిని పంపించేలా ఓటింగ్ జరుపుతున్నారు. అయితే ఈ ఓటింగ్ లో అందరు పక్కా తేజశ్వినే వస్తుందని భావిస్తున్నారు.


హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉన్న తేజశ్వి బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. కాని అనుకోకుండా వచ్చేసింది. ఇక మరో పక్క ఆల్రెడీ ఆమె ప్రవర్తన నచ్చకనే ఆమెని హౌజ్ నుండి బయటకు పంపిస్తే మళ్లీ ఎలా ఆడియెన్స్ ఆమెకు ఓటేస్తారని అంటున్నారు.


అయితే కౌశల్ కు చెక్ పెట్టేలా హౌజ్ లో తేజూ ఉంటేనే బాగుంటుంది అన్నది కొందరి మాట. అయితే భాను శ్రీ కూడా హౌజ్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. భాను కూడా అప్పటిదాకా హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉంది. అమిత్ నామినేషన్ వల్ల భాను ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఈ ఇద్దరు కాకుంటే నూతన్ నాయుడు మళ్లీ హౌజ్ లోకి వస్తే ఎలా ఉంటుందో అంచనా వేస్తున్నారు.  


ఆల్రెడీ హౌజ్ లో ఉన్న వారిలో కౌశల్ ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. అతడే ఒక సైన్యంలా పోరాడుతున్నాడు. ఒకవేళ అతనికి నూతన్ నాయుడు తోడైతే మాత్రం ఆ సీన్ వేరేలా ఉంటుంది. కచ్చితంగా హౌజ్ లో అందరికి నూతన్, కౌశల్ కలిసి చుక్కలు చూపించేయడం ఖాయమని చెప్పొచ్చు. అయితే ఎలిమినేట్ అయిన వారిలో కిరీటి మాత్రం తిరిగి హౌజ్ లోకి వెళ్లే ఛాన్స్ లేదని అంటున్నారు. సంజనా కూడా ఆడియెన్స్ ను మెప్పించలేదు. అందుకే ఆమె వచ్చే ఛాన్స్ అసలు లేదని తెలుస్తుంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: