మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఆధ్యాత్మికత ఎక్కువ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా గా ఉన్న చరణ్ తనలో ఉన్న అధ్యాత్మికతను కొనసాగించడానికి సమయం చిక్కినప్పుడల్లా గుడిలకు వెళుతూ ఉంటాడు. తన సినిమా వ్యహారలతో పాటు తన కుటుంబం కోసం  ఎక్కువ సమయాన్ని వెచ్చించే అలవాటు ఉన్న చరణ్ తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని పెంచుకోవడానికి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కనపరుస్తూ ఉంటాడు. 
సాధువులతో సామాన్యుడిలా
ఇలాంటి పరిస్థుతులలో చరణ్ ఈమధ్య నిజామాబాద్ లోని దోమకొండ దేవాలయాన్ని దర్శించుకున్నాడు. అయితే అక్కడ చరణ్ అతి సామాన్యుడిలా సాధువుల పక్కన కూర్చుని ఉన్నప్పుడు క్లిక్ మానిపించిన ఒక ఫోటో ఇప్పుడు మీడియాకి లీక్ కావడంతో ఆ ఫోటో  మీడియాలో వైరల్ గా మారింది. బాగా అలసిపోయి కనిపిస్తున్న రామ్ చరణ్ పంచెకట్టులో సామాన్యుడిలా కనిపిస్తునాడు. 
ఆధ్యాత్మిక కోణం
ప్రతి ఏడాది చరణ్ అయ్యప్పమాల ధరించే విషయం తెలిసిందే. తన తండ్రి నుండి ఈ ఆధ్యాత్మికత తనకు వచ్చిందని చరణ్ చెపుతూ ఉంటాడు. సినిమా షూటింగ్ సమయాలలో తప్ప  చరణ్ చాల సింపుల్ గా కనిపిస్తాడు. ఈనిరాడంబరత ఆధ్యాత్మికతల వల్ల తనకు ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని చరణ్ అభిప్రాయం. 
Ram Charan dancing pose hd wallpapers | Wallpapers Wide Free
ప్రస్తుతతరం యంగ్ హీరోలలో చరణ్ కు ఉన్నంత స్థాయిలో ఆధ్యాత్మిక అభిరుచి మరి ఏహీరోలలోను లేదు. ప్రస్తుతం చరణ్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి సంబంధించిన టైటిల్ అదేవిధంగా ఈమూవీ ఫస్ట్ లుక్ ఆగష్టు15న విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈమూవీ షూటింగ్ పూర్తి అయిన వెంటనే చరణ్ రాజమౌళి బందిఖానాలోకి వెళ్ళిపోతాడు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరొకవైపు నిర్మాతగా భారీ సినిమాలు నిర్మిస్తూ మధ్యలో అనేక వ్యాపార వ్యవహారాలను కూడ నిర్వహిస్తున్న చరణ్ తన మానసిక ఏకాగ్రత కోసం ఇలా గుడుల చుట్టూ తిరుగుతున్నాడనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: