అదేంటి చిన్న సినిమాగా వచ్చిన ఆరెక్స్ 100 సంచలన విజయం అందుకుంటే డిజాస్టర్ అవ్వడం ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఆరెక్స్ 100 ఇప్పటివరకు 10 కోట్ల పైగా వసూళ్లను రాబట్టి సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తుంది. మరి అలాంటి సినిమా డిజాస్టర్ ఎలా అవుతుంది అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.


కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన ఆరెక్స్ 100 మూవీ యువతను బాగా ఆకట్టుకుంది. సినిమాలో ఘాటు ముద్దులు అదరగొట్టారు హీరో, హీరోయిన్. ఇక పాయల్ అందాల సంగతి గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మడికి ఈ సినిమా తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చి పెట్టింది. 


ఇప్పటికే ఆరెక్స్ 100 హీరోయిన్ మరో రెండు సినిమాలకు సైన్ చేసిందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అవగా ఓవర్సీస్ లో మాత్రం డిజాస్టర్ కలక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు ఆరెక్స్ 100 కేవలం 1,30,000 డాలర్స్ మాత్రమే రాబట్ట గలిగింది. ఓ తెలుగు సినిమా ఇంత తక్కువ వసూళ్లను రాబట్టడం చాలా అరుదు. 


సో ఈ లెక్కల ప్రకారం చూస్తే యూఎస్ ఆడియెన్స్ కు ఆరెక్స్ 100 నచ్చలేదని చెప్పొచ్చు. తెలుగులో కూడా బి, సి సెంటర్స్ లో ఆడియెన్స్ కు ఈ సినిమా నచ్చింది. పాయల్ కేవలం అందాల ప్రదర్శన మాత్రమే కాదు ఇలాంటి పాత్రని ఒప్పుకున్నందుకు అమ్మడి గట్స్ ను మెచ్చుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: