ఈసంవత్సరం బ్లాక్ బస్టర్ గా రికార్డులు క్రియేట్ చేసిన ‘రంగస్థలం’ పరోక్షంగా ప్రభాస్ కు సహకరిస్తూ ఉండటం ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘సాహో’ నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే ప్రభాస్ ‘జిల్’ రాధకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్న విషయం తెలిసిందే. 
Rangasthalam Movie Village Set Photos
వచ్చేనెల నుండి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీ కథ కూడ 1970 కాలంనాటి ప్రేమకథ అని తెలుస్తోంది. దీనికోసం ఆకాలంనాటి పరిస్తుతులను గుర్తుకుచేసే ఒక గ్రామీణ వాతావరణానికి సంబంధించిన సెట్ ను వేస్తున్నారు. ఈసినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు చాలామటుకు ఈ సెట్లోనే చిత్రీకరించబోతారని టాక్. 
Rangasthalam Movie Village Set Photos
దీనికి సంబంధించి ఈమూవీ దర్శక నిర్మాతలు ‘రంగస్థలం’ సెట్ ను వాడుకోబోతున్నట్లు సమాచారం. భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న బూత్ బంగ్లా ఏరియాలో సుకుమార్ ‘రంగస్థలం’ కోసం 1980 కాలంనాటి విలేజ్ సెట్ వేసినట్లుగా ఇదే సెట్ ను ఉపయోగించికుని కొన్ని మార్పులు చేర్పులు చేసి 1970 కాలంనాటి పరిస్తుతులను గుర్తుకు చేసే విధంగా ‘రంగస్థలం’ సెట్ ను వాడుకోబోతున్నట్లు టాక్. 
 Prabhas
‘రంగస్థలం’ సెట్ గురించి సుకుమార్ 2కోట్లు ఖర్చు పెట్టిన నేపధ్యంలో ఇంత భారీ ఖర్చు వృథా కాకుండా చాల వ్యూహాత్మకంగా ప్రభాస్ సినిమాకు పనికివచ్చే రీతిలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఈసినిమాకు కూడ సుమారు 150 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని వార్తలు వస్తున్న ఎప్పటి నుంచో ప్రభాస్ తో సినిమా తీయాలి అని కలలు కంటున్న కృష్ణంరాజు కోరికకు జిల్ రాధాకృష్ణ ఎంత వరకు సక్సస్ ను ఇస్తాడో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: