మెగా ప్రిన్సెస్ నిహారిక తన మొదటి సినిమా ఫెయిల్ అయిన నేపధ్యంలో తన రెండవ సినిమాకు చాల ఎక్కువ గ్యాప్ తీసుకుంది. ‘హ్యాపీ వెడ్డింగ్’ అంటూ రేపు విడుదల కాబోతున్న ఈమూవీని ప్రమోట్ చేస్తూ నిహారిక అనుసరిస్తున్న వ్యూహాలలో చూపిస్తున్న ఎనర్జీ లెవెల్స్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 
Image may contain: 47 people, people smiling, crowd
ఒక చిన్న సినిమాగా రూపొందిన ఈమూవీని జనం మధ్యకు ముఖ్యంగా యూత్ మధ్యకు తీసుకువెళ్ళడంలో నిహారిక అనుసరిస్తున్న వ్యూహాలకు యూత్ బాగా కనెక్ట్ అవుతోంది. ఈసినిమాను ప్రమోట్ చేస్తూ నిహారిక గన్నవరం భీమవరం అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలకు చెందిన కాలేజీలలో నిహారిక అక్కడి స్టూడెంట్స్ ను కలుస్తూ వారితో మాట్లాడటమే కాకుండా వారందరితో కలిసి డాన్సులు చేస్తూ డైలాగ్స్ చెపుతూ నిహారిక చేస్తున్న హంగామా చూసి ఈసినిమా యూనిట్ సభ్యులే ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం.
Image may contain: 4 people, people smiling, crowd and basketball court
దీనికితోడు నిహారికను చూడగానే ఆకాలేజీలలోని అమ్మాయిలు అబ్బాయిలు ఈలలు వేస్తూ చేస్తున్న హంగామా చూస్తుంటే నిహారికకు యూత్ లో ఇంత క్రేజ్ ఉందా అని ‘హ్యాపీ వెడ్డింగ్’ యూనిట్ సభ్యులే ఆశ్చర్యపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాలో హీరోగా నటిస్తున్న సుమంత్ అశ్విన్ కూడ ఈమూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆకాలేజీలలోని యూత్ అంతా సెల్ఫీల కోసం సుమంత్ అశ్విన్ ను అడగకుండా చాలామంది నిహారిక చుట్టూ మూగడం ఈకార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా వర్గాలను కూడ ఆశ్చర్యపరుస్తోంది. 
Image may contain: 1 person, smiling, sitting
దీనికితోడు ఈమూవీని ప్రమోట్ చేస్తూ టీవీలకు ప్రింట్ మీడియాకు నిహారిక ఇస్తున్న ఇంటర్వ్యూలలో ఆమె ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి ‘హ్యాపీ వెడ్డింగ్’ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయినప్పటికీ నిహారిక అనుసరిస్తున్న వ్యూహాలతో ‘హ్యాపీ వెడ్డింగ్’ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా మారిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈసినిమా సోలో రిలీజ్ గా కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ తో పోటీగా విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ రేస్ లో నిహారిక విజియం సాదిస్తే ఇక ఆమెకు ఎదురుండదు అన్నది వాస్తవం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: