శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ కి బాలీవుడ్‌లో లభించిన  క్రేజ్ తో ఆమెని ఎలాగైనా దక్షిణాదిలో పరిచయం చేయాలని అప్పుడే ప్రయత్నాలు మొదలైపోయాయి. ఇప్పటికే ఈవిషయమై చాలామంది ప్రముఖ దర్శక నిర్మాతలు జాన్వి తండ్రి బోనీకపూర్ ను సంప్రదిస్తున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా  రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మల్టీ స్టారర్ లో జాన్వీని ఒక కథానాయికగా తీసుకుంటే ఎలా ఉంటుది అన్న ఆలోచనలు రాజమౌళికి వస్తున్నట్లు సమాచారం.  
Jhanvi Kapoor
ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ మరియు తమిళ మళయాళ భాషలలో మల్టిపుల్‌ లాంగ్వేజ్  మూవీగా విడుదలచేయబోతున్న నేపధ్యంలో జాన్వీని ఒక కథానాయికగా తీసుకుంటే ఈమూవీకి మరింత క్రేజ్ వస్తుందని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ రాజమౌళికి సూచించినట్లు సమాచారం. కరణ్‌ జోహార్‌ తో రాజమౌళికి ఉన్న అనుబంధం రీత్యా రాజమౌళి ఈసలహా ఎంతవరకు ఆచరణ యోగ్యం అన్న కోణంలో జక్కన్న ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. 
  RRR Movie
అయితే రాజమౌళి జూనియర్ చరణ్ లో తీయబోతున్న ఈమల్టీ స్టారర్ లో హీరోయిన్ గా నటించే ఏ నటి అయినా కనీసం వందరోజుల పైగా కాల్షీట్లు ఇవ్వాలి అని చేపుతున్నాడట. అయితే ఇంత బల్క్ రేంజ్ లో జాన్వి రాజమౌళికి డేట్స్ ఇచ్చి సహకరిస్తుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో  రాజమౌళి ‘బాహుబలి’ లో శివగామి పాత్ర కోసం మొదట అతిలోక సుందరి శ్రీదేవిని  సంప్రదించిన విషయం తెలిసిందే.   
gallery
అయితే ఆమె అధిక పారితోషికం డిమాండ్ చేయడంతో రమ్యక్రిష్ణను ఎంచుకున్నానని ఓపెన్ గానే రాజమౌళి చెప్పాడు. అప్పుడు పెద్ద వివాదమే జరిగింది. అయితే జరిగిన ఈ సంఘటనలు అన్నీ మర్చిపోయి రాజమౌళి జాన్వీ వైపు చూసినా ఇప్పటికే రాజమౌళి దృష్టిలో పడ్డ కీర్తి సురేశ్ రకుల్ ప్రీత్ లలో ఎవరికి జర్క్ ఇచ్చి జాన్వీని ఎంపిక చేసుకుంటాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: