స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత కెరియర్ లో ఎప్పుడు లేని విధంగా కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు. స్టార్ ఇమేజ్ రావడం కోసం ఎంత కష్టపడాలో అది వచ్చాక ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయడం కూడా అంతే కష్టం. ఇక పొరపాటున ఒక ఫ్లాప్ వచ్చింది అంటే దాని నుండి బయట పడేందుకు నానా హైరానా ఉంటుంది.


ప్రస్తుతం బన్ని పరిస్థితి అలానే ఉందని చెప్పొచ్చు. డిజే తర్వాత నా పేరు సూర్యపై అంచనాలు పెట్టుకోగా అది కాస్త తుస్సుమన్నది. వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా నిరాశ పరచింది. అందుకే తర్వాత ఎలాంటి సినిమా చేయాలి.. ఎవరి డైరక్షన్ లో సినిమా చేయాలి అనే కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు.


కొన్నాళ్లుగా విక్రం కుమార్ డైరక్షన్ లో బన్ని మూవీ ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే బన్ని కథ వరకు ఓకే అనిపించినా కథనం విషయంలో ఇద్దరికి పొంతన కుదరట్లేదట. అందుకే బన్ని మళ్లీ పునరాలోచనలో పడ్డాడట. ఇక ఇప్పుడు లేటెస్ట్ టాక్ ప్రకారం పూరితో బన్ని సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.


పూరి డైరక్షన్ లో బన్ని హీరోగ దేశముదురు, ఇద్దరమ్మాయిలతో సినిమాలు వచ్చాయి. మొదటిది హిట్ రెండోది నాట్ బ్యాడ్ అయితే ప్రస్తుతం అసలేమాత్రం ఫాం లో లేని పూరి బన్నితో సినిమా చేయాలని చూస్తున్నాడు. అయితే కథల విషయంలో పూరిని నమ్మడం కష్టం అందుకే బయట కథకు బన్నిని హీరోగా పెట్టి సినిమా చేయాలని చూస్తున్నాడు. పూరి లాస్ట్ హిట్ టెంపర్ అలానే మంచి ఫలితం అందుకున్నాడు పూరి. మరి పూరి, బన్ని కలిసి సినిమా చేస్తారా లేరా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: