నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ సోసోగానే నడుస్తుంది. అయితే రియాలిటీ షోలో కొత్త అనుభూతిని పొందాలనుకునే వారు ఈ షోని రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నారు. 16 మంది కంటెస్టంట్స్ గా మొదలైన బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఆరుగురు ఎలిమినేట్ అవడంతో మధ్యలో ఇద్దరు వైల్డ్ కార్డ్ గా వచ్చి 12 మంది హౌజ్ లో ఉన్నారు.


ఈ వారం సర్ ప్రైజింగ్ గా పూజా రామచంద్రన్ ఇంట్లోకి వచ్చింది. అయితే ఎవరొచ్చినా ఎవరున్నా మొదటి నుండి అందరికి అర్ధం కాని క్యారక్టర్ గా ఉన్నాడు కౌశల్. తనతో గొడవ పెట్టుకుంటే ఇంటి నుండి బయటకు వెళ్తారని చెప్పడంతో ఇంట్లో సభ్యులంతా కౌశల్ మీద కక్ష్య కట్టారు.


అయితే అది తనన్నది కాదని తనీష్ చెప్పిన సంగతి తాను ప్రస్థావించానని అన్నాడు కౌశల్. హౌజ్ లో  అందరు స్నేహ భావంతో ఉంటుంటే కౌశల్ మాత్రం తాను వేరే అన్నట్టుగా ఉంటున్నాడు. అయితే పర్ఫెక్ట్ గేమ్ ప్లానింగ్ లో భాగమే ఇదంతా అని తెలుస్తున్నా అతనికి బయట మాత్రం కౌశల్ ఆర్మీ అంటూ ఓ ఫ్యాన్ గ్రూప్ ఏర్పడింది.


హౌజ్ లో రోజులు గడుస్తున్నా కొద్ది మనస్థత్వాలు మారుతుండగా మొదటి రోజు నుండి ఇప్పటివరకు కౌశల్ అలానే ఉన్నాడు. తాను ఎవరికి క్లోజ్ అవకపోవడం తప్ప మిగతా గేమ్ అంతా బాగా ఆడుతున్నాడు. హేతువాది అయిన బాబు గోగినేని కూడా అసహనం కోల్పోయి కౌశల్ మీద పగబట్టాడు. మరి చూస్తుంటే ఫైనల్ రేసులో కౌశల్ తప్పక ఉంటాడనిపిస్తుంది. అతడే ఒక సైన్యం గా అతని ఆర్మీ కూడా అతన్ని కాపాడుతుందని చెప్పొచ్చు.    
 


మరింత సమాచారం తెలుసుకోండి: