నిన్నటి ‘బిగ్ బాస్ 2’ కార్యక్రమం అత్యంత ఉద్రేకపూరిత వాతావరణంలో జరగడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. కెప్టెన్ టాస్క్ కు సంబంధించిన పోటీ ఇంటి సభ్యుల్లో చిచ్చురేపింది. గీతా మాధురీ మరోసారి కెప్టెన్‌గా ఎంపిక కావడంపై బాబు గోగినేని రగిలిపోయాడు. తన నోటి దురుసును మరోసారి బయటపెట్టి నిన్నటి షోకు హైలెట్ గా మారాడు. 
దీప్తిని నెట్టిన బాబు గోగినేని
గీతామాధురి బాబు గోగినేనిల మధ్య మాటల వార్ మొదలుకావడంతో రెచ్చిపోయిన బాబు గోగినేని కెప్టెన్‌గా అవ్వడం కోసం ‘బిగ్ బాస్’ హోస్ ను రెండు వర్గాలుగా చీలుస్తున్నావు అంటూ బాబు గోగినేని గీతామాధురి పై రెచ్చిపోయాడు. ఈమాటలకు సరైన సమాధానాలు ఇస్తూ గీత మాధురి తన పద్ధతి తన మాటలు నచ్చకపోతే ‘బిగ్ బాస్’ కు కానీ నానీకి కాని ఫిర్యాదు చేసుకోండి అంటూ షాకింగ్ రిప్లయ్ ఇచ్చింది.  
విగ్రహంలా నిలబడిన నలుగురు
దీనితో మరింత రెచ్చిపోయిన బాబు గోగినేని గీత మాధురిని కౌశల్ ను ‘బిగ్ బాస్’ ఇంటి నుంచి పంపిండమే తన ధ్యేయం అంటూ శపధాలు చేసాడు. ఈ వ్యవహారంతో గీత కన్నీరు పెట్టుకోవడం ఏడుస్తున్న గీతను దీప్తి ఊరడించడం కూడ నిన్నటి ఈ కార్యక్రమానికి రేటింగ్స్ తీసుకు వచ్చే విధంగా డిజైన్ చేసారు.
గొడవ కొనసాగింపు
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కావాలని రేటింగ్స్ కోసం ఇలా ‘బిగ్ బాస్’ హౌస్ సభ్యుల మధ్య చిచ్చు పెడుతున్నారా ? లేదంటే ఎలిమినేషన్ ను తప్పించుకోవడానికి ఎవరికీ వారు తమ వ్యూహాలను అనుసరిస్తూ ఎదుటివారిని టార్గెట్ చేస్తూ తమ ఇమేజ్ ని పెంచుకోవడానికి ఇదంతా చేస్తున్నారా అని అనిపించడం ఇది సహజం. ఇప్పటికే ఎలిమినేషన్ తో బయటకు వెళ్ళిపోయిన సెలెబ్రెటీలు తిరిగి ‘బిగ్ బాస్’ హౌస్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తూ అనేక ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తమ ఓటింగ్ ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఎవరికి వారు ఎదుటి వారి పై విమర్శలు చేస్తున్న నేపధ్యంలో జరుగుతున్న పరిణామాలు బుల్లితెర ప్రేక్షకులకు జోష్ ను ఇస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: