అక్కినేని కోడలు సమంత తనకు అవకాసం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలో సందడి చేస్తూ తన అభిమానులకు ఆనందాన్ని పంచుతుంది. ఈమధ్య కాలంలో అక్కినేని యంగ్ హీరోల సినిమాలను ప్రమోట్ చేయడం ఒక పనిగా పెట్టుకున్న సమంత తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. 
Prashanth R. Vihari Chi La Sow (Original Motion Picture Soundtrack)
నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా వచ్చే వారం ఆగష్టు 3న విడుదల కాబోతున్న ‘చి.ల.సౌ.’ సినిమా ప్రమోషన్ వెనుక సమంత సలహాలు ఉన్నాయి అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. తన సినిమాకు యూత్ ను బాగా కనెక్ట్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో యూత్ కు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు సుశాంత్. ‘హలొ బాయ్స్ అండ్ గర్ల్స్ మిమ్మల్ని బ్యాచులర్ పార్టీకి ఆహ్వానిస్తున్నాం’ అంటూ సుశాంత్ ట్వీట్ చేసాడు. అంతేకాదు యూత్ లో పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకునేందుకు మంచి కారణం చెప్పిన వారికి ‘చి.ల.సౌ’ చిత్రాన్ని విడుదలకు ముందే చూసే అవకాసం కల్పిస్తామని తెలిపాడు. ఆ తరువాత పార్టీ కుడా ఉంటుందని ట్వీట్ చేసాడు సుశాంత్.

అయితే ఈ ట్వీట్ కు నాగచైతన్య రిప్లై ఇస్తూ బ్యాచులర్స్ కు మాత్రమే అంటున్న ఈ పార్టీకి తాను కూడ వస్తానని తనకు పెళ్లి అయినా తనలోని బ్రహ్మచారి ఇంకా బ్రతికే ఉన్నాడని చైతు సుశాంత్ కు ఫన్నీ మెసేజ్ పెట్టాడు. చైతు చేసిన ట్విట్ ను చూసిన సమంత స్పందిస్తూ తన భర్త చైతన్య చెప్పింది నిజమే అంటూ అతడిలోని బ్రహ్మచారి ఇంకా బ్రతికే ఉన్నాడు అంటూ ఫన్నీ కామెంట్ పెట్టింది. 
Chi La Sow Release Date
దీనితో వీరి ముగ్గురి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ ప్రస్తుతం నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటోంది. కొత్త గ్యాప్ తీసుకుని హీరో సుశాంత్ నటించిన ‘చి.ల.సౌ’ చాల ఆశలు పెట్టుకున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేటితరం యూత్ కు కనెక్ట్ అయ్యే చాల విషయాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ చైతూ పై సమంత చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటో ఆమెకే తెలియాలి.. 




మరింత సమాచారం తెలుసుకోండి: