ఈరోజు విడుదలైన ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ అన్ని ప్రముఖ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన నిహారిక తన వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికర విషయాలను లీక్ చేసింది. అదేవిధంగా తన పెళ్ళి ప్లాన్స్ ను కూడ బయటపెట్టింది. 
happy-wedding-promotional-video-by-niharika
తనకు ఇండస్ట్రీలో ఒక 10 సంవత్సరాలు నటించి నెంబర్ వన్ అనిపించుకోవాలనే కోరిక లేదని మూడు నాలుగేళ్ల మించి తాను సినిమాలలో నటించను అనీ ఆతరువాత వెబ్ సిరీస్ లు చేసుకుంటాను అంటూ తన భవిష్యత్ ప్రణాళికను బయటపెట్టింది మెగా డాటర్. ఇదే సందర్భంలో తన సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ తాను నటించడం మానివేసిన తరువాత కూడ తన గురించి గౌరవంగా చెప్పుకునే సినిమాలను మాత్రమే చేయాలి అన్నది తన అభిప్రాయం అంటూ తనసినిమాల స్క్రిప్ట్ ఎంపిక వెనుక రహస్యాన్ని బయట పెట్టింది.
నా 'వెడ్డింగ్' గురించి మీకెందుకు...నిహారిక ఫైర్..!
ఇదేసందర్భంలో తన అన్న వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ తనను కథ నచ్చితే సినిమా చేయి అని సలహా ఇచ్చే తన అన్న ఎన్నిసార్లు తాను అడిగినా తాను నటించే సినిమాల కథలు వినడని ఎదో ఒక కారణంతో తప్పించుకుంటాడు అంటూ తన అన్న పై తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచింది నిహారిక. తన ఉద్దేశ్యంలో సోషల్ మీడియా అంటే సమయం వృథ చేసే విషయం అని అంటూ అందువల్ల తాను సోషల్ మీడియా గురించి అందులో వచ్చే వార్తల గురించి పట్టించుకొను అంటూ సెటైర్లు వేస్తోంది ఈమెగా ప్రిన్సెస్.
Niharika playing cameo role in SyeRaa movie
మెగా కుటుంబం నుంచి రావడంతో తన పై విపరీతమైన ఒత్తిడి పెరిగిపోయి ఏచిన్న తప్పు చేసినా దానిని జనం భూతద్దంలో చూస్తున్న నేపధ్యంలో ఒకొక్కసారి తన మెగా కుటుంబం బ్యాక్ గ్రౌండ్ తనకు మేలు చేస్తోందా హాని చేస్తోందా అని తేల్చుకోలేక పోతున్నాను అంటూ మెగా ఫ్యామిలీ పైనే సెటైర్లు వేస్తోంది. గంటలకొద్ది సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని ఆ ఫోన్ పైనే దృష్టి పెడుతూ వార్తలను చూస్తుంటే ఏవ్యక్తి ఏవిషయంలోను ఎదగలేడు అని అంటూ కేవలం తాను ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికే తన సెల్ ఫోన్ ను వాడుతున్నాను అంటూ ఈనాటి తరం సెల్ ఫోన్ పై తమా మోజును తగ్గించుకోకపోతే ఏవిషయంలోనూ వారు రాణించలేరు అన్న అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తోంది నిహారిక..   



మరింత సమాచారం తెలుసుకోండి: