మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో రాంచరణ్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నాడు.  సుకుమార్, రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.  అంతే కాదు రాంచరణ్ కెరీర్ లో రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.  ఈ చిత్రంతో సమంత అద్భుతమైన నటన..యాంకర్ అనసూయ ‘రంగమ్మత్త’గా మంచి ఫేమస్ అయ్యారు.  ప్రస్తుతం రాంచరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతుంది.  అయితే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని డిటేల్స్ చాలా గోప్యంగా ఉంచుతున్నారు. 
Related image
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ భారీ ఫైట్ సీన్ రామోజీ ఫిలిమ్ సిటీలో తీస్తున్నట్లు సమాచారం. ఇక ఇండస్ట్రీలో బోయపాటి శ్రీనివాస్ సినిమాలంటే ఓ ప్రత్యేకత ఉంటుంది.  బోయపాటి తీసే యాక్షన్లు సీన్లు హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. ఇక రాంచరణ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు..యాక్షన్ సీన్లుకు పెట్టింది పేరు.  వీరిద్దరి కాంబినేషన్ లో యాక్షన్ సీన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అభిమానులు ఇప్పటి నుంచే తెగ కలలు కంటున్నారు.
Image result for ram charan boypati
రాంచరణ్ రణ్‌, ఆర్యన్‌ రాజేష్‌, ముఖేష్‌ రుషి తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాలో రాంచరణ్ ని కొత్త కోణంలో చూపించబోతున్నారట దర్శకులు.  రాంచరణ్ సరసన కైరా అడ్వాని  హీరోయిన్ గా నటిస్తుంది.  డివివి దానయ్య నిర్మాత. మాస్‌తో పాటు కుటుంబ ప్రేక్షకుల్నీ అలరిస్తుంద’’ని చిత్రబృందం తెలిపింది. ఆగస్టులో ఫస్ట్‌లుక్‌ విడుదలకి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: