‘గంగోత్రి’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్..తర్వాత వచ్చిన దేశముదురు, ఆర్య, బన్ని సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు.  మెగాహీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు అల్లు అర్జున్ ఈ సినిమాలతో ప్రూఫ్ చేశాడు. అందుకే అల్లు అర్జున్ ని ఫ్యాన్స్ ముద్దుగా స్టైలిష్ స్టార్ అంటారు.  చిరంజీవి, పవన్ కళ్యాన్ తర్వాత మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అల్లు అర్జున్ బాగానే సంపాదించాడు. 
Related image
ముక్కుసూటిగా మాట్లాడే అల్లు అర్జున్ ఆ మద్య ‘సరైనోడో’ ఫంక్షన్లో పవన్ కళ్యాన్ కి వ్యతిరేకంగా మాట్లాడారని పెద్ద రగడే కొనసాగింది.  అయితే ఆ మద్య నటి శ్రీరెడ్డి వ్యవహారం లో పవన్ కళ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేసినపుడు..ఫిలిమ్ ఛాంబర్ కి వెళ్లినపుడు అల్లు అర్జున్ వెళ్లి మామయ్య అండగా నిలిచారు.  అంతే కాదు అప్పుడు ఆలింగనం చేసుకొని తన బాధ కూడా వ్యక్తం చేశాడు.  ఆ మద్య నాపేరు సూర్య ఫంక్షన్ కి పవన్ కళ్యాన్ రావడంతో మెగా హీరోల మద్య ఎలాంటి విభేదాలు లేవని తేలిసిపోయింది. 
Image result for allu arjun pawan kalyan
అయితే నాపేరు సూర్య సినిమా పెద్దగా విజయం సాధించలేదు..ఆ సినిమా తర్వాత బన్నీ ఏ సినిమా పై కూడా క్లారిటీ ఇవ్వలేదు. తమ అభిమాన హీరో నెక్ట్స్ మూవీ ఏంటన్న విషయమై అల్లు ఫ్యాన్స్ లో చర్చ సాగుతున్న వేళ, తన ట్విట్టర్ ఖాతా ద్వారా బన్నీ స్పందించాడు.


"మై డియర్ ఫ్యాన్స్... మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా తదుపరి సినిమా ప్రకటన గురించి ఓపికగా ఉండమని కోరుతున్నాను. ఎందుకంటే అది ఇంకాస్త సమయాన్ని తీసుకోవచ్చు. ఓ మంచి చిత్రాన్ని మీకందించాలని చూస్తున్నాను. కొంత సమయం పడుతుంది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు" అని ట్వీట్ చేశారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: