అలనాటి మేటి నటీమణి జమున తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పుకొచ్చారు. హీరోయిన్ గా నా మొదటి సినిమా  'పుట్టిల్లు' .. అప్పటికి నాకు 15 వెళ్లి 16 వచ్చి వుంటాయి. ఆ సమయంలో నేను చాలా సన్నగా ఉండేదాన్ని..దాంతో చాలా మంది నన్ను చీపురుపిల్ల అంటూ ఏడిపించారు. ఈ చిత్రం గురించిన కవర్ పేజీ పబ్లిష్ అయింది. దాంతో 'షూటింగ్ స్టార్ట్ అయింది. డాక్టర్ గరికపాటి రాజారావుగారు తన చిత్రంలో చీపురు పుల్లలాంటి హీరోయిన్ ను పెట్టారు .. పేరు జమున' అని ఒక పేపర్లో రాశారు.
Related image
ఆ దెబ్బతో మా అమ్మగారు నేను లావు కావడానికి మంచి ఆహార పదార్థాలతో పాటు పండ్ల రసాలు లాంటివి చేసి ఇచ్చేది.  ఒకప్పటికీ .. ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. నేను .. సావిత్రి .. భానుమతి .. ఇలా మా తరంలో అందరం ఎదుగుతున్నా కొద్దీ ఒదుగుతూ వచ్చాం. అలా ఉండటం వల్లనే ఒక్కొక్కళ్లం పాతిక .. ముప్పై సంవత్సరాలు కథానాయికలుగా చెలామణి అయ్యాం. అప్పట్లో మాకన్నా పెద్దవారిని ఎంతో గౌరవించేవారు. దర్శకులు ఏది చెబితే అలా చేసేవాళ్లం..మాకు మంచిది అనిపిస్తే వారితో చర్చించే వాళ్లం. 
Image result for actress jamuna
ఇప్పుటి తరం దీనికి పూర్తి భిన్నంగా మారిపోయింది.  ఇండస్ట్రీలో చాలా అవమానపరిచే విధంగా కొంత మంది తయారయ్యారు.   ఇప్పుడు సీనియర్స్ ను గౌరవించే పరిస్థితులు లేవు. ఈ మధ్య ఒక సినిమా ఫంక్షన్ లో ఒక హీరో పక్కన కూర్చున్నాను .. ఆ హీరో తన బూటుకాలు నాకు తగిలేలా కాలుమీద కాలేసుకుని కూర్చున్నాడు.  అతనికి కనీస సంస్కారం కూడా లేదని నేను అర్థం చేసుకున్నాను. 


మరింత సమాచారం తెలుసుకోండి: