ప్రముఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనేనేను’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు మహేష్ బాబు.  ఈ సినిమా మహష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు..రెండు వందల కోట్ల క్లబ్ లో చేర్చింది.  ప్రస్తుతం మహేష్ బాబు  నిర్మాత, దర్శకులు పైడిపల్లి వంశి దర్శకత్వంలో నటిస్తున్నాడు.  ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా నటించబోతున్నట్లు సమాచారం.  అయితే ఈ పాత్ర కోసం మహేష్ బాబు గడ్డం పెంచుకుంటున్నాడు. రీసెంట్ గా మహేష్ లుక్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. క్రియేటివ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 25వ మూవీ చేస్తున్నారు మహేష్.
Image result for mahesh babu vamsi paidipally
దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఉత్తరాఖండ్‌లో అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు.   ఈ రోజు దర్శకుడు వంశీ పైడిపల్లి పుట్టినరోజు సందర్భంగా ఆయనతో కలిసి ఉన్న షూటింగ్ స్పాట్ పిక్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు మహేష్.  తాజాగా వంశి పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు ఇలా ట్విట్ చేశాడు.
Image result for mahesh babu vamsi paidipally
‘వెరీ హ్యాపీ బర్త్ డే టు మై 40 ఇయర్స్ యంగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి’ అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు మహేష్. నా స్నేహితుడైన వంశీకి 40 ఏళ్లు వచ్చినా 20 ఏళ్ల యువకుడిలా ఆనందంగా ఉంటారు, ఇది చాలా అద్భుతమైనది’ అంటూ మహేష్ తన డైరెక్టర్ వంశీకి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేశారు.  వీరిద్దరూ నవ్వులు చిందిస్తూ..నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: