బిగ్ బాస్ హౌజ్ లో కాస్త అతి చేసే వాళ్లను బయటకు పంపించేస్తున్నారు బుల్లితెర ఆడియెన్స్. అనవసరమైన కామెంట్స్ తో రియాలిటీ షో కాన్సెప్ట్ ను దెబ్బతీసే విధంగా ఎవరు ఏం చేసినా ప్రేక్షకులు సహించడం లేదు. అందుకే భాను, తేజశ్విలు బయటకు వచ్చారు. అయితే ఈసారి ఆ విధంగా హౌజ్ లో అనవసర వాదనలతో వివాదం సృష్టిస్తున్నాడు బాబు గోగినేని.


హేతువాది అయిన బాబు గోగినేని అక్కడ జరిగే పరిస్థితులను పర్సనల్ గా తీసుకుని రియాక్ట్ అవడం చూస్తూనే ఉన్నాం. కౌశల్ మీద ఇప్పటికే నెగటివ్ ఇంప్రెషన్ తో ఉన్న బాబు గోగినేని.. నిన్నటి ఎపిసోడ్ లో గీతా మాధురిని టర్గెట్ చేశాడు. కెప్టెన్సీ టాస్క్ లో బాబు చేసిన పనికి గీతా మాధురి ఆయనతో డిస్కషన్ మొదలు పెట్టింది.


అయితే డిస్కషన్ కాస్త బాబు, గీతాల ఫైట్ కు దారి తీసింది. అందుకే ఈసారి ఆడియెన్స్ బాబుని టార్గెట్ చేస్తారని అనుకుంటున్నారు. కచ్చితంగా ఈసారి నాని కూడా బాబు గోగినేనికి క్లాస్ పీకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. హౌజ్ లో గ్రూపులు నిర్మించొద్దు అని గీతాకి వార్నింగ్ ఇచ్చిన బాబు గోగినేని ఆమె కన్నీళ్లు పెట్టుకునేలా చేశాడు.


కచ్చితంగా గీతాకు సానుభూతి ఏర్పడటమే కాకుండా బాబు మీద ప్రేక్షకులు నెగటివ్ ఇంప్రెషన్ కలిగేలా చేసింది. ఈసారి నామినేషన్ లేదు కాబట్టి ఓకే లేదంటే ఈసారి తప్పకుండా బాబు గోగినేని బయటకు వచ్చేవాడు. ఇక ఈ వారం ఎలిమినేట్ అయిన వారిని ఇంట్లోకి పంపించేందుకు ఓటింగ్ పెట్టారు. మరి దానిలో ఎవరు ఇంట్లోకి వెళ్తారో కూడా సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: