నేచురల్ స్టార్ గా విజయాలతో దూసుకుపోతూ టాప్ హీరోలనే షేక్ చేస్తున్న నాని బుల్లితెర ‘బిగ్ బాస్ 2’ షోతో మరింత క్రేజీ స్టార్ గా మారిపోతాడని అందరూ భావించారు. అయితే ఈ షోకు సంబంధించి హోస్ట్ గా నాని ఈషోను నడుపుతున్న తీరు చాలామందిని నిరాశపరుస్తున్న నేపధ్యంలో నాని అనవసరంగా ఈ బుల్లితెర ప్రయోగాన్ని ఎంచుకున్నాడా అన్న అభిప్రాయం నాని అభిమానులలో ఉంది.
అలాంటి సినిమా పడలేదు
ఇలాంటి పరిస్థుతులలో నాని అతిధిగా వచ్చి లాంచ్ చేసిన ‘గూఢచారి’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాని కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు. తాను ‘బిగ్ బాస్’ షో అయ్యేంతవరకు బయటకు ఎక్కడకి వెల్ళకూడదు ఏ ఈవెంట్స్ కు హాజరు కాకూడదు అని అనుకున్నానని అయితే అనుకోకుండా తనను ‘గూఢచారి’ చిత్రం ట్రైలర్ లాంచ్ చేయాలని తనను పిలవడంతో ఈ సినిమా టైటిల్ పై ఉన్న తనకు ఏర్పడ్డ ఇష్టం ఈమూవీ ట్రైలర్ లాంచ్ కి వచ్చేలా చేసిందని కామెంట్స్ చేసాడు. 
బిగ్ బాస్ అయ్యేంతవరకు
అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన చాలామంది ప్రముఖులు నాని నోటి వెంట వచ్చిన మాటలు విని షాక్ అయినట్లు టాక్. దీనికి కారణం ‘బిగ్ బాస్’ షో అయ్యేంతవరకు తాను బయటకు రాకూడదు అని అనుకున్నానని నాని చేసిన కామెంట్స్. 
Bigg Boss 2 Telugu,Bigg Boss 2 Telugu day 1 highlights,Nani
దీనితో ‘బిగ్ బాస్’ షోలో తాను రాణించ లేకపోతున్నాను అన్న టెన్షన్ నానికి ఏర్పడంతో అనుకోకుండా నాని నోటి వెంట ఇలాంటి మాటలు వచ్చాయా అంటూ కొందరు కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ‘బిగ్ బాస్’ హోస్ నుండి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన సెలెబ్రెటీలు హోస్టింగ్ లో నాని సమర్థతను జూనియర్ సమర్థతతో పోలుస్తూ చేస్తున్న కామెంట్స్ కూడ నానీని విపరీతంగా బాధ పెడుతున్నట్లు టాక్. దీనితో ‘గూఢచారి’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో అనుకోకుండా నోరుజారిన నాని మాటలు పెద్ద ప్రకంపనలే సృష్టిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: