శ్రీరెడ్డి రేపిన కాస్టింగ్ కౌచ్ వివాదం సినీ ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపింది. శ్రీరెడ్డి పలువురు ఇండస్ర్టీ వ్యక్తుల మీద సంచలన ఆరోపణలు చేసింది. దీనితో ఈ విషయం మీద చాలా మంది హీరోయిన్స్ తమ కు ఎదురైనా అనుభవాలను, అభిప్రాయాలను మీడియా తో పంచు కున్నారు. తాజాగా ఇదే విషయం మీద పూజాకుమారి స్పందించారు.  ఈమె గతంలో తెలుగులో హీరో డాక్టర్ రాజశేఖర్ నటించిన "గరుడవేగ", ఆ తర్వాత విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం "విశ్వరూపం-2" చిత్రాల్లో నటించింది.

Image result for vishwaroopam 2 heroine

ఈ నేపథ్యంలో ఆమె క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందిస్తూ, తానెప్పుడూ కాస్టింగ్ కౌచ్‌ సమస్యను ఎదుర్కోలేదని చెప్పింది. పైగా, పడక సుఖం అందిస్తేనే సినీ అవకాశాలు వస్తాయా? అని ఆమె ఎదురు ప్రశ్నించింది. టాలెంట్ ఉంటే అవ‌కాశాలు వాటంతటవే వ‌స్తాయ‌ని, త‌ప్పుడు ప‌నులు చేసి అవ‌కాశాలు వ‌చ్చేలా చేసుకోవ‌డం అవ‌స‌ర‌మా? అని ఆమె ప్రశ్నించింది. కాగా, శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన ఆరోపణలు చేయడమేకాకుండా, ఈ ఊబిలో పలువురు హీరోయిన్లు సైతం ఉన్నట్టు ప్రకటించారు. క్యాస్టింగ్ కౌచ్‌లో పలువురు హీరోలకు సంబంధం ఉన్నట్టు సంచలన ఆరోపణలు చేశారు. 

Image result for vishwaroopam 2 heroine

అయితే కొంత మంది సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పారు. మరీ కొంత మంది కాస్టింగ్ కౌచ్ కు మేము కూడా బాధితులమని మీడియా ముందు వాపోయారు. అయితే నిజ నిజాలను పరిశీలిస్తే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉన్నదన్నది నిజం. ఎందుకంటే ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం హాలీవుడ్ లోనే ఉంది మన ఇండస్ట్రీలో ఉండదా... అని లాజిక్స్ మాట్లాడే వారు లేకపోలేదు..!



మరింత సమాచారం తెలుసుకోండి: