సాక్ష్యం సినిమా ఎన్నో అంచనాలు నడుమున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా లౌక్యం డైరెక్టర్ శ్రీవాస్ కావడం తో ఈ సినిమా మీద అంచనాలు పెరిగినాయి. దీనితో ఈ సినిమా కు కొంచెం హిట్ టాక్ వచ్చిన సినిమా అదిరిపోయి ఉండేది. అయితే సినిమా మొదటి షో కే నెగటివ్ రివ్యూ లు వచ్చాయి. అదేనా  రెండు ప‌దాల టైటిల్స్ తో సినిమా చేస్తే హిట్ అవుతుంద‌న్న సెంటిమెంట్ తో సాక్ష్యం అనే టైటిల్ పెట్టారు. సినిమా క‌థ‌కు..టైటిల్ కు సంబంధం ఉండ‌దు. కేవ‌లం సెంటిమెంట్ గానే టైటిల్ పెట్టాడు.

Image result for saakshyam

క్యారెక్ట‌ర్ల‌కు కొత్త‌గా ఉండే పేర్లు పెట్టాడు గానీ, కొత్త ఫీల్ ను ఇచ్చే సినిమా మాత్రం చేయ‌లేదు. మ‌ధ్య‌లో ఆడియ‌న్ క‌న్ప్యూజ్ చేసే క‌థ‌నంతో స‌హనాన్ని ప‌రీక్షించాడు. ఇక శ్రీవాస్ సినిమాల్లో విల‌న్స్ ఎప్పుడూ వీక్ గానే ఉంటారు. సాక్ష్యంలోనూ అదే రిపీట్ చేసాడు. విల‌న్ బ‌లంగా కొడ‌తాడు…లిల‌న్ వీక్ గా ప‌డిపోతాడు. శ్రీనివాస్ ఇమ్మెచ్యుర్డ్ పెర్పామెన్స్ చిరాకు పుట్టిస్తుంది. బాడీ బాగున్నా…ఇమేజ్ లేని హీరోను చొక్కా లేకుండా చూడ‌టం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. చొక్కా విప్పి షో చేయాలంటే స్టార్ ఇమేజ్ ఉండాలి.

Image result for saakshyam

అది లేకుండా చొక్కా విప్పితే అబాసుపాలు కావ‌డం త‌ప్ప‌..ఒరిగేదేమీ ఉండ‌దు. ఎన్టీఆర్, మ‌హేష్ బాబు లాంటి హీరోలే చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపించాలంటే చాలా విష‌యాలు ఆలోచించారు. మ‌రి శ్రీనివాస్ ఏ ధైర్యంతో చొక్కా విప్పాడో? అత‌నికే తెలియాలి. ఓవ‌రాల్ గా సినిమాపై నెగిటివ్ ఇంప్రెసన్ ప‌డింది. రివ్యూలు ప్ర‌తికూలంగానే వ‌చ్చాయి. శ్రీనివాస్ లో ట్యాలెంట్ ఉంది. మంచి హైట్..ఫిజిక్..ఫేస్ వ్యాల్యూ ఉంది. కానీ దాన్ని బ‌య‌ట‌పెట్టే స‌రైన ద‌ర్శ‌కుడే కుద‌ర‌డం లేదు. మాస్ హీరో అవ్వాల‌నుకోవ‌డం లో త‌ప్పు లేదు. కానీ దానికి ముందు చేయాల్సిన సినిమాలు మాత్రం ఇవి కావ‌ని ప‌బ్లిక్ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: