రాజమౌళి తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో చాల విభిన్నమైన పద్ధతులు అనుసరిస్తూ ఉంటాడు. అంతేకాదు తన సినిమాల కథల ఎంపిక విషయంలో చాల వెరైటీని ప్రదర్శించే రాజమౌళి తన ఆలోచనల పై తాను చిన్నప్పుడు విన్న కథల ప్రభావం ఉంది అంటూ అనేక ఇంటర్వ్యూలలో చెప్పాడు. 
Goodachari Poster (Photo : Twitter)
తాను తీసిన ‘మగధీర’ ‘ఈగ’ కథలను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తన చిన్నతనంలో తనను పడుకోపెడుతూ చెప్పిన విషయాన్ని గతంలోనే చెప్పాడు జక్కన్న. ఇప్పుడు అలాంటి మాటలను విభిన్న పాత్రలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న అడవి శేషు త్వరలో విడుదల కాబోతున్న తన ‘గూఢచారి’ మూవీని ప్రమోట్ చేస్తూ చేసిన కామెంట్స్ రాజమౌళి మాటలను గుర్తుకు చేస్తున్నాయి అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. 
Adivi Sesh,Kshanam,Goodachari
త్వరలో విడుదల కాబోతున్న ఈమూవీ కథను అడవి శేషు తన చిన్నతనంలోనే వ్రాసుకున్నాడట. ఒక స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈమూవీ కథకు సంబంధించిన ఆలోచనలు తన చిన్నతనంలో చదివిన డిటెక్టివ్ నవలల వల్ల వచ్చాయి అంటూ అడవి శేషు కామెంట్స్ చేస్తున్నాడు. దీనితో ఇతడికి కూడ రాజమౌళి లాగే తన చిన్నతనంలోనే తన కథలకు సంబంధించిన ఆలోచనలు వచ్చాయా అంటూ కొందరు జోక్ చేస్తున్నారు. 

శశి కిరణ్ దర్శకత్వం వహించిన ఈమూవీ ఆగష్టు 3న విడుదల కాబోతున్న నేపధ్యంలో ఇప్పటికే ఈమూవీ టీజర్ కు సంబంధించి వచ్చిన అనూహ్య స్పందన ఈమూవీ పై అంచనాలు పెంచుతోంది. నాగార్జున మేనకోడలు సుప్రియ కీలక పాత్రలో నటిస్తున్న ఈసినిమాకు రాజమౌళి ప్రేరణ ఎంత వరకు అడవి శేషును రక్షిస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: