టాలీవుడ్ లో నాగ చైతన్య హీరోగా వచ్చిన ఓకే లైలా కోసం మూవీతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ పూజా హెగ్డే.  ఆ తర్వాత వెంటనే మెగా హీరో మొదటి సినిమా వరణ్ తేజ్ మొదటి సినిమా ‘ముకుంద’ పూజా హెగ్డే నటించింది.  ఆ తర్వాత తెలుగు లో చాలా గ్యాప్ తీసుకుంది.  2012లో తమిళంలో మూగ ముడి చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన పూజా హెగ్డే ఆరేళ్లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు,తమిళ భాషల్లోనే కాదు బాలీవుడ్ లో కూడా అగ్ర హీరోల సరసన నటించిన పూజా,ఇటీవల తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన రంగస్థలం మూవీలో రామ్ చరణ్ పక్కన జిగేల్ రాణి ఐటెం సాంగ్ లో కుర్రకారుని ఫిదా అయ్యేలా చేసింది.
Image result for pooja hegde family photos
తాజాగా దువ్వాడ జగన్నాధంతో స్టార్ డమ్ అందుకున్న ఈ కన్నడ బ్యూటీ ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న అరవింద సమేత లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. ముంబయిలో 1990 అక్టోబర్ 13న జన్మించిన పూజా తల్లిదండ్రులు చాలాకాలం క్రితమే కర్ణాటక నుంచి ముంబయి వెళ్లి స్థిరపడ్డారు. పూజా తండ్రి మంజునాధ్ హెగ్డే వ్యాపార వేత్త. తల్లి లత హెగ్డే క్యూ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ నిపుణురాలు.
Image result for pooja hegde family photos
ముంబయి ఎం ఎం కాలేజీలో చదివిన పూజా, 2010లో నిర్వహించిన మిస్ యూనివర్స్ ఇండియా సెకండ్ రన్నర్ అప్ గా నిలవడంతో మోడలింగ్ ఛాన్స్ లు వరించాయి.పలు మోడలింగ్ లలో పనిచేస్తున్న సమయంలో తమిళంలో మూగమూడి చిత్రం లో ఛాన్స్ రావడంతో ఆనందంతో ఒప్పుకుంది. హిందీలో హౌస్ ఫుల్ ఫోర్ మూవీలో చేస్తున్న ఈ మంగుళూరు భామ, జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత లో నటిస్తోంది. మరో మూడేళ్ళ దాకా పూజా డేట్స్ ఖాళీ లేనంతగా ఎదిగింది. ఇక ప్రభాస్ హీరోగా వచ్చే తదుపరి మూవీలో కూడా హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: