ఎన్.టి.ఆర్ బదులు నానిని హోస్ట్ గా అనుకున్న నాటి నుండి షో అయితే నడిపిస్తున్నా తన టైం కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపించిన నాని ప్రతి వారం హౌజ్ లో ఉన్న కంటెస్టంట్స్ అందరికి క్లాస్ పీకుతున్నా బిగ్గర్ బాస్ అంటూ హౌజ్ లో తనకు తానే బాస్ గా ఫీల్ అవుతున్న బాబు గోగినేని దగ్గరకు వచ్చేసరికి సైలెంట్ అయ్యేవాడు.


ప్రముఖ హేతువాది బాబు గోగినేనిని ఫేజ్ చేయడం కాస్త కష్టమే. అయితే హోస్ట్ గా ఎలా మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని కూడా లేదు. బాబు గోగినేనితో నాని మొదటి నుండి జాగ్రత్తపడుతున్నాడు. అయితే కరెక్ట్ టైం దొరికితే మాత్రం ఆడేసుకుందామని అనుకున్న నాని రీసెంట్ ఎపిసోడ్స్ లో ఆయన ప్రవర్తనతో ఆ ఛాన్స్ దొరికింది.


నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా గీతా మాధురితో బాబు గొడవ తెలిసిందే. ఇక అంతకుముందే కౌశల్, గీతాలను ఇంటి నుండి బయటకు పంపించడమే తన ముఖ్య ఉద్దేశమని బాబు చెప్పడం పెద్ద దుమారం రేపింది. అంతేకాదు తానో ఇంటర్నేషనల్ ఫిగర్ అంటూ తనకు తాను సొంత డబ్బా కొట్టుకోవడం బాబుని టార్గెట్ అయ్యేలా చేసింది. 


అయితే ఈరోజు నాని బాబుని టార్గెట్ చేసిన విధానం అడిగిన ప్రశ్నలు.. చెప్పిన సమాధానాలు నాని ప్రతిభను చాటిచెప్పాయి. తారక్ సీజన్ పక్కన పెడితే నాని ఈ షోని ఎంత సమర్ధవంతంగా తీసుకెళ్తున్నాడు అని చెప్పేందుకు ఈ ఒక్క ఎపిసోడ్ చాలనిపిస్తుంది. ఇక ఈవారం ఎలిమినేషన్ లేదని ఆడియెన్స్ కు తెలిసినా నామినేట్ అయిన వారిని ఎవరిని సేఫ్ జోన్ లో పెట్టకుండా నాని వారిని మరింత టెన్షన్ పడేలా చేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: