తెలుగులో వస్తున్న బిగ్ బాస్  2 సిజన్ లో రోజు రోజుకీ ఆసక్తి పెరిగిపోతుంది.  మొదట్లో బిగ్ బాస్ లో సభ్యుల మద్య ఎలాంటి వివాదాలు లేకుండా సాగింది.  గత మూడు వారాల నుంచి గ్రూపీజం, కుతంత్రాలు జరుగుతున్నాయి.  నిన్న  బిగ్‌బాస్‌ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలపై హోస్ట్ నాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. లగ్జరీ బడ్జెట్ టాస్క్ విషయంలో వివాదం, సభ్యులు గ్రూపులు కట్టడం, బాబు గోగినేని అనుచిత వ్యాఖ్యలపై నాని ఘాటుగా స్పందించాడు.  కెప్టెన్సీ టాస్క్ అనంతరం బాబు-గీతామాధురి మధ్య జరిగిన గొడవ విషయంలో బాబుపై నాని మండిపడ్డాడు.  స్థాయి గురించి మాట్లాడటానికి డిక్షనరి లో అర్థం కనపడదని..మనసుకు నచ్చింది చేయడానిక ఒకరి అనుమతి అవసరం ఉండదని అన్నారు. 
Image result for big boss 2 telugu
అంతే కాదు వీరి విషయంలో రాజమౌళి మ్యాటర్ కూడా వచ్చింది.  దీప్తి గెలవడం మీకు ఇష్టం లేదన్న విషయం మీ చేష్టల ద్వారానే అర్థం అవుతోందన్న నాని...  గ్రూపులు కట్టి అందరినీ ప్రభావితం చేస్తున్నారన్నాడు.గీతా మాధురి విషయంలో అందరూ ఒక్కసారిగా ఎందుకు పైరయ్యారని బాబును నిలదీశాడు. బాబును నామినేట్ చేసిన కారణాలు సరిగా లేవంటూ కౌశల్‌ను మందలించాడు. అయితే, కౌశల్ తన వాదనను సమర్థించుకున్నాడు.

రాజమౌళి తనను తాను నాస్తికుడని చెప్పుకుంటాడని, కానీ గుడికి వెళ్లాడంటూ అనవసర వ్యాఖ్యలు చేయడం తనకు నచ్చలేదని, అందుకే నామినేట్ చేశానని కౌశల్ వివరించాడు.కౌశల్‌ను, గీతను హౌస్ నుంచి బయటకు పంపించడమే తన లక్ష్యమని, ఒకవేళ తాను బయటకు వెళ్లిపోయినా, ఆ పని మీరు చేయాలంటూ హౌస్ సభ్యులకు బాబు గోగినేని చెప్పడంపై నాని విరుచుకుపడ్డాడు.  బాబు మాట్లాడుతూ తనకు హౌస్‌లోనే ఉండాలని ఉందని, కానీ పంపించాలనుకున్నా అందుకు సిద్ధమేనని, తానెవరికీ భయపడనని పేర్కొన్నారు. హౌస్‌లో కౌశల్ గేమ్ ప్లే చేస్తున్నాడంటూ మరోమారు బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రబుద్ధుడు అని విరుచుకుపడ్డాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: