ఒకప్పుడు క్రియేటివ్ డైరక్టర్ గా సంచలన విజయాలు అందుకున్న కృష్ణ వంశీ ఇప్పుడు ఆయన పరిస్థితి దారుణంగా మారింది. ఆయనతో సినిమా అంటే నిర్మాతలు ఆమడ దూరం జరిగేలా సినిమాల ఫలితాలు ఉన్నాయి. నక్షత్రం సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకోగా అది కూడా ఘోరంగా పోయింది. 


కృష్ణవంశీ పూర్తిగా ట్రాక్ తప్పేశాడని తెలుస్తున్న ఈ టైంలో కె.వి ఓ సంచలనానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. తన తీసిన సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి మెప్పించిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తో సినిమా చేసేందుకు కృష్ణవంశీ సిద్ధమవుతున్నాడట. మరోసారి తన సత్తా చాటేలా ఈ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడట కృష్ణ వంశీ.


స్టార్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నా వరుస అవకాశాలు అతన్ని ఇబ్బందుల్లో పడేశాయి. ఇప్పుడు యువ హీరోలు కూడా కె.వి సినిమా అంటే అంత సుముఖత చూపట్లేదు. అందుకే ప్రకాశ్ రాజ్ హీరోగా ఓ సినిమా తీసి మళ్లీ తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ప్రకాశ్ రాజ్ అందుకు ఒప్పుకుంటాడా అతన్ని మెప్పించే కథ కృష్ణవంశీ రాస్తాడా అన్నది డిస్కషన్స్ లో ఉంది.


కె.వితో సినిమా నిర్మాతలు కూడా సాహసం చేయట్లేదు. మరి ఈసారి కృష్ణవంశీ ఎలా తన సినిమా తెరకెక్కిస్తాడో చూడాలి. ప్రకాశ్ రాజ్ ఒప్పుకుంటే మాత్రం కచ్చితంగా కథలో దమ్ము ఉన్నట్టే. ఒకవేళ ఆయన కాదంటే మాత్రం కృష్ణవంశీ కెరియర్ దాదాపు ముగిసినట్టే అని చెప్పొచ్చు. 
    


మరింత సమాచారం తెలుసుకోండి: