యంగ్ హీరోగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకోవాలని ప్రయత్నిస్తున్న నాగశౌర్య హీరో నితిన్ వ్యూహాలను అనుసరిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదట్లో హిట్స్ అందుకుని ఆతరువాత వరసగా 8 సంవత్సరాలపాటు వరస పరాజయాలను ఎదుర్కున్న నితిన్ కెరియర్ ను అతడు తన సొంత బ్యానర్ పై నిర్మించిన ‘ఇష్క్’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ మూవీల విజయం తిరిగి ట్రాక్ లోకి తీసుకు వచ్చింది. 

ఇప్పుడు నితిన్ స్పూర్తితో యంగ్ హీరో నాగశౌర్య కూడ అదే పద్ధతిని అనుసరిస్తూ ఈమధ్య ‘ఛలో’ సినిమాను నిర్మించి తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు. ఈమూవీ సక్సస్ తో నాగశౌర్యకు బయట బ్యానర్ల నుండి ఆఫర్స్ వచ్చినా వాటి పై దృష్టి పెట్టకుండా తిరిగి తన సొంత బ్యానర్ లో ‘నర్తనశాల’ మూవీ చేస్తున్నాడు. 
Naga Shourya Narthanasala movie launch - Sakshi
ఆశ్చర్యకరంగా ఈమూవీ టైటిల్ బట్టి మంచి క్రేజ్ ఏర్పడటంతో ఆ క్రేజ్ కు తగ్గట్లుగా ‘నర్తనశాల’ మూవీని నాగశౌర్య నిర్మిస్తున్నట్లు టాక్. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం బయట నిర్మాతలు దర్శకులు తీసే సినిమాల పై ఆధార పడటం కంటే సొంతం సినిమాలతో ఎంత రిస్కయినా తానే భరించాలని నాగశౌర్య అనుకుంటున్నాడు అని వార్తలు వస్తున్నాయి. 
Naga Shourya
ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో యంగ్ హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి గతంలో నితిన్ ప్రస్తుతం నాగశౌర్యలు అనుసరిస్తున్న వ్యూహాలను చాలామంది యంగ్ హీరోలు అనుసరించే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే ఈ అభిప్రాయాలు అన్నీ నాగశౌర్య నిర్మిస్తున్న ‘నర్తనశాల’ విజయం పై ఆధారపడి ఉంటుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: