రాజమౌళి త్వరలో సెట్స్ పైకి తీసుకువెళ్ళబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే పాత్ర స్వరూపం లీక్ కావడంతో ఇప్పుడు ఆపాత్ర పై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈభారీ మల్టీ స్టారర్ లో జూనియర్ నటించబోయే పాత్ర విప్లవ భావాలతో ఉండే ఒక దేశభక్తుడి పాత్ర అని తెలుస్తోంది. 
RRR,SS Rajamouli,Ram Charan Teja
ఈమూవీ కథ భారతదేశానికి స్వాతంత్రం రాక ముందు కాలం నాటిది కాబట్టి అప్పటి స్వాతంత్రోద్యమ ఛాయలతో విప్లవ భావాలతో ఉండే యువకుడిగా జూనియర్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఒక విధంగా చూస్తే అక్కడక్కడ అల్లూరి సీతారామరాజును గుర్తుకు చేసే విధంగా జూనియర్ పాత్రను రాజమౌళి డిజైన్ చేస్తున్నట్లు టాక్. 
S S Rajamouli Announces Next Film With 'Titans' Jr NTR And Ram Charan
గంభీరమైన డైలాగ్స్ ను పలకడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడి ఉన్న జూనియర్ చేత అలనాటి స్వాతంత్రోద్యమ స్పూర్తిని గుర్తుకు చేసేలా జూనియర్ కు పవర్ ఫుల్ డైలాగ్స్ వ్రాయిస్తున్నట్లు సమాచారం. నందమూరి తారకరామారావు జీవించిన కాలంలో అల్లూరి సీతారామరాజు సినిమాను తీయాలని అనేక ప్రయత్నాలు చేసినా అప్పుడు కుదరకపోవడంతో ఒక సినిమాలో సీతారామరాజుగా కొద్ది సమయం కనిపించి ఎన్టీఆర్ తన కోరిక తీర్చుకున్నాడు. 

అయితే ఆ నందమూరి హీరోకు తాను వారసుడుని అని చెప్పుకునే జూనియర్ అలనాడు తన తాత నటించలేకపోయిన ‘అల్లూరిసీతారామరాజు’ పాత్ర షేడ్స్ తో జూనియర్ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటించడం యాధృశ్చికం అనుకోవాలి. ఇప్పటికే అంచనాలు పెంచుతున్న ఈమూవీలో ఒక హీరోయిన్ గా కీర్తి సురేశ్ ఎంపిక అయితే మరొక హీరోయిన్ గా అలియా భట్ శ్రద్ధా కపూర్ జాన్వీ లలో ఎవరిని ఎంపిక చేసుకోవాలి అన్న ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: