సినిమాల నుండి రాజకీయాలలోకి వచ్చిన పవన్ ఒకేసారి తన వ్యూహాలను మార్చి తాను రాజకీయాలలో కూడ ‘పవర్ స్టార్’ అని పిలిపించుకునే విధంగా సరికొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో రైతులు నిర్వహించిన పోరాటం ఆరాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేలా చేసింది. నాసిక్ నుంచి ముంబైకి 200 కిలోమీటర్ల దూరం కాలి నడకతో వేలాది సంఖ్యలో రైతులు ‘కిసాన్ ర్యాలి’ పేరుతో జరిపిన ఉద్యమం దేశ వ్యాప్త సంచలనం. 
నరేంద్ర మోడీ లాంటివాడికి నచ్చకుంటే
పార్టీలకు అతీతంగా రైతులు అంతా ప్రాణాలకు తెగించి ఇళ్లనుంచి బయటకొచ్చి ఊర్లు దాటుకుంటూ ముంబాయి చేరుకున్న ఆ ర్యాలీకి మహారాష్ట్ర జనం నీరాజనం పలికింది. ప్రభుత్వం దిగొచ్చినా రాకపోయినా ఇదొక మోడల్ ప్రొటెస్ట్ అంటూ నేషనల్ మీడియా కూడా ఆ ఉద్యమానికి అత్యంత ప్రచారాన్ని కల్పించారు. మరాఠా ప్రాంతానికి చెందిన రైతులు చేపట్టిన ఈ ఉద్యమానికి మహారాష్ట్రాలోని ఫడ్నవీస్ సర్కార్ దిగివచ్చి రైతులతో రాజీకి వచ్చింది. 
అన్నయ్య, వదినలు నచ్చచెప్పారు
ఇప్పుడు అటువంటి ఉద్యమాన్ని ఆంద్రప్రదేశ్ లోని రైతుల కోసం పవన్ కళ్యాణ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రెడిషనల్ పొలిటికల్ పార్టీలు చేపట్టే సాదాసీదా పాదయాత్రలులా కాకుండా ఒక మిలియన్ మార్చ్ లేదా మరాఠా మార్చ్ లాంటి స్థాయిలో ఉద్యమాలు చేయాలని రైతులతో ఒకసారి, నిరుద్యోగ యువకులతో మరోసారి చలో అమరావతి మార్చ్ చేపట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడని మీడియా వర్గాల ద్వారా సంకేతాలు అందుతున్నాయి.  
అందుకే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టలేదు
సర్కారీ భూ దోపిడీపై ప్రజా ఉద్యమాలు చేయడం ద్వారానే ‘జనసేన’ బలపడుతుందని పవన్ భావిస్తున్నట్లు టాక్. ''చిన్నతనంలోనే సాయుధ పోరాటంలోకి వెళ్లాలనుకున్నాను ఫ్యాక్షనిస్టులు కిరాయి గూండాయిజం చేసేవారు రెచ్చగొట్టాలనుకుంటే రెచ్చిపోయి భయపడేవాడిని కాదు'' అని పవన్ లేటెస్ట్ గా జరిగిన ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా విమర్శించే వారి తోలు తీస్తాను అని అనడంతో పవన్ ఏ పార్టీ నాయకుడి తోలుతీయబోతున్నాడు అంటూ కొందరు పవన్ వ్యతిరేకులు సెటైర్లు వేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: