వారసులైనా.. టాలెంట్ చాటి స్టార్ క్రేజ్ సంపాదించిన హీరోలైనా సినిమా అంటే ఎప్పుడు ఆరు పాటలు.. నాలుగు ఫైట్లు.. రెండు కామెడీ సీన్స్ తో వస్తే  అభిమానులు ఇప్పుడు ఒప్పుకునే పరిస్థితి లేదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా కంటెంట్ ఉన్న సినిమాకే ప్రేక్షకులు పెద్దపీఠ వేస్తున్నారు. ఇక ఈమధ్య కాలంలో మారిన ప్రేక్షకుల ఆలోచన ధోరణిలో భాగంగా స్టార్స్ కూడా ఆడియెన్స్ కు నచ్చే సినిమాలనే తీసేందుకు సుముఖంగా ఉన్నారు.


పక్కాగా చెప్పాలంటే రెగ్యులర్ మూస మాస్ కథలకు స్వస్థి చెప్పి.. మంచి కథ దానితోడు మంచి కథనం ఉన్న సినిమాలను చేస్తున్నారు. స్టార్ సినిమా అంటే టీజర్ వ్యూయర్ కౌంట్ నుండి రికార్డులు లెక్కే. ఇక కలక్షన్స్ అయితే ఏరియా వైజ్ రికార్డ్ చూస్తారు. ఈ క్రమంలో కంటెంట్ ఉన్న స్టార్ సినిమా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాయి. 


ఓ ఐదేళ్ల ముందు దాకా 100 కోట్ల కలక్షన్స్ అంటే అందని ద్రాక్ష లానే ఉండేది. కాని కాలం మారింది పోకిరి టైం లో 50 కోట్ల మార్కే పెద్ద ఫిగర్ కాని ఇప్పుడు 100 కోట్లు యావరేజ్ ఆడినా వచ్చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు స్టార్ హీరోలంతా తమ టార్గెట్ 200 కోట్లు పెట్టుకున్నారు. సినిమా హిట్ టాక్ వస్తే చాలు దానికి తగిన ప్రమోషన్స్ చేసుకుని 200 కోట్ల మార్క్ అందేలా చూస్తున్నారు.   


పక్కాగా చెప్పాలంటే బాహుబలి వచ్చాకనే తెలుగు బాక్సాఫీస్ పై ఈ రికార్డులు షురూ అయ్యాయి. బాహుబలి బిగినింగ్ కన్నా కన్ క్లూజన్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే క్రేజీ రికార్డ్ సొంతం చేసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: