యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న అరవింద సమేత సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ లో సిక్స్ ప్యాక్ తో కనిపించి అలరించిన తారక్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ అయితే జరుపుకుంటున్నా మిగతా అప్డేట్స్ ఏమి లేవు. 


అయితే లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ అరవింద సమేత షూటింగ్ స్పాట్ నుండి ఓ పిక్ లీక్ అయ్యింది. ఎన్.టి.ఆర్ పైజామా వేసుకుని నడిచివస్తున్న పిక్ లీక్ అయ్యింది. జై లవ కుశలో కూడా ఎన్.టి.ఆర్ ఈ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్ హల్ చల్ చేస్తుంది.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడట. అయితే తారక్ చేస్తుంది డ్యుయల్ రోలా లేక సింగిల్ రోలా అన్నది తెలియాల్సి ఉంది.


అక్టోబర్ 10న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం చేస్తున్న ఈ సినిమాపై కాస్త ప్రెజర్ ఉన్న మాట వాస్తవమే. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: