యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. బాహుబలి సినిమా అతని కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా మాత్రమే కాద్జు తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఇక ప్రస్తుతం బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది.


రన్ రాజా రన్ సినిమా తర్వాత సుజిత్ చేస్తున్న సినిమా సాహో. హాలీవుడ్ సినిమా ఫీల్ కలిగేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది. సినిమా టీజర్ దగ్గర నుండి రిలీజ్ వరకు దర్శక నిర్మాతలు సెంటిమెంట్స్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది.


ఈ సినిమా టీజర్ అక్టోబర్ 23న రిలీజ్ చేయబోతున్నారట. ఆరోజు ప్రభాస్ బర్త్ డే కావడం విశేషం. ఇక ఇదవరకు బాహుబలి సినిమాకు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. అదే సెంటిమెంట్ తో ఇప్పుడు సాహో కూడా ప్రభాస్ బర్త్ డేకి టీజర్ రిలీజ్ చేస్తారట. 


ఇక సినిమా రిలీజ్ కూడా ఏప్రిల్ లోనే ఉంటుందని తెలుస్తుంది. బాహుబలి 2 ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యి సంచలన విజయం అందుకుంది. అదే సెంటిమెంట్ తో సాహోని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఫాలో అవడం మంచిదే కాని సినిమాలో కంటెంట్ ఉంటే ఎప్పుడొచ్చినా అది సంచలనమే అవుతుందని కొందరు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: