మెగా బ్రదర్ నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ హీరో మొదట కాస్త తడిబడినట్టు అనిపించినా ఫిదాతో తనని ఆడియెన్స్ ఎలాంటి పాత్రల్లో చూడాలని అనుకుంటున్నారో అర్ధమైందనుకుంటా అందుకే ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమ సినిమాతో కూడా హిట్ అందుకున్నాడు.


ప్రస్తుతం ఘాజి డైరక్టర్ సంకల్ప్ రెడ్డితో అంతరిక్షం మూవీ చేస్తున్న వరుణ్ తేజ్ మరో పక్క అనీల్ రావిపుడి డైరక్షన్ లో విక్టరీ వెంకటేష్ తో కలిసి ఎఫ్-2 సినిమాలో కూడా నటిస్తున్నాడు. వెంకటేష్, వరుణ్ క్రేజీ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. హ్యాట్రిక్ హిట్స్ తో అనీల్ ఈ సినిమాను ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది.


ఇక ఈ రెండు సినిమాలే కాకుండా వరుణ్ తేజ్ ఇప్పుడు నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో కూడా మూవీ లైన్ లో పెట్టాడట. నేను లోకల్ హిట్ తర్వాత రామ్ తో సినిమా చేస్తున్న త్రినాథరావు వరుణ్ తేజ్ తో అంటే మరో క్రేజీ ప్రాజెక్ట్ తన ఖాతాలో ఉన్నట్టే. ఓ పక్క సాయి ధరం తేజ్ వరుస ఫ్లాపులు తీస్తుంటే వరుణ్ మాత్రం క్రేజీ కాంబినేషన్ లో సినిమాలు చేస్తున్నాడు.  


మెగా హీరోలకే వరుణ్ టఫ్ కాంపిటీషన్ గా మారడం విశేషం. అందుకే అతని సినిమాలతో మెగా హీరోలే షేక్ అవుతున్నారు. తేజూ కథల విషయంలో పొరపాట్లు చేస్తుంటే వరుణ్ తేజ్ మాత్రం మంచి ఫాంలో ఉన్నాడని చెప్పొచ్చు. మరి త్రినాథరావు వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.     



మరింత సమాచారం తెలుసుకోండి: