క్రేజీ హీరో విజయ్ దేవర కొండ నటించిన ‘గీతాగోవిందం’ ఆడియో ఫంక్షన్ నిన్న ఘనంగా జరిగింది. ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా వచ్చిన అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్య పరిచాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది మంచి నటులు ఉన్నారు కాని గొప్ప నటులు కొంతమంది మాత్రమే అని అంటూ విజయ్ దేవరకొండ ఒక గొప్ప నటుడు అంటూ అల్లు అర్జున్ విజయ్ ను ఆకాశానికి ఎత్తేశాడు.
Geetha Govindam audio launch date confirmed
ఇదే సందర్భంలో బన్నీ మాట్లాడుతూ తాను అర్జున్ రెడ్డి సినిమా చూసిన తరువాత ఒక వారం రోజులు తాను ఎవర్ని కలవలేదని ఆ మూవీలో విజయ్ నటన తనను ఎంతగానో వెంటాడింది అంటూ బన్నీ కామెంట్ చేసాడు. అంతేకాదు మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే విజయ్ మనస్తత్వం తనకు నచ్చుతుంది అంటూ బన్నీ కామెంట్స్ చేసాడు. 
Geetha Govindam Telugu Movie
బన్నీ నోటివెంట ఈకామెంట్స్ విన్నవారు గొప్ప నటుల స్థాయిలో విజయ్ దేవరకొండను బన్నీ చేర్చడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దీనితో అల్లు కాంపౌండ్ హీరోగా విజయ్ దేవరకొండను అల్లు అర్జున్ మార్చివేశాడా అంటూ మరికొందరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్త పరుస్తున్నారు. 
Vijay Deverakonda
అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈమూవీ పై ఇప్పటికే ప్రీ పాజిటివ్ టాక్ వచ్చిన నేపధ్యంలో నిన్నటి ఫంక్షన్ లో అల్లు అర్జున్ విజయ్ పై చేసిన కామెంట్స్ తో ఈమూవీ మరింత క్రేజీ మూవీగా మారడం ఖాయం అని అంటున్నారు. తాను నిజంగా మారిపోయానని తన మార్పు అందరూ గుర్తించాలి అంటే ‘గీతాగోవిందం’ సినిమా చూస్తే తెలుస్తుంది అంటూ ఈ క్రేజీ హీరో చేస్తున్న కామెంట్స్ ను బట్టి కొత్త విజయ్ ను ‘గీతాగోవిందం’ చూపెట్టబోతోంది అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: