ఈ మద్య కొంత మంది సోషల్ మాద్యమాల్లో ఫేక్ ఫోటోలతో నానా రాద్దాంతం చేస్తున్నారు.  తమ  ఫోటోల పక్కన స్టార్ హీరోల ఫోటోలు జత చేయడం అలాగే హీరోయిన్ల ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటారు.  సాధారణంగా ఎదో ఒక చిన్న హీరోయిన్ ఫోటో, మోడల్ ఫోటో, యాంకర్ల ఫోటోల పక్కన తమ ఫోటో పెట్టి పోస్ట్ చేస్తున్న వారిని చూస్తూనే ఉన్నాం.  తాజాగా ఓ ఆకతాయి..తాను ఏదో చేయబోతే..తనకే పంచ్ పడినట్లయ్యింది. 
Image result for samantha
ఈ మద్య సమంత పెళ్లైన విషయం తెలిసిందే.   ఓ సెలబ్రటీ, స్టార్ హీరోయిన్ అందులోనే ఈ మద్య పెళ్లైన ఒక హీరోయిన్ ని  పెళ్లి చేసుకున్నట్టుగా పిక్‌ని ఎడిట్ చేసి పెడితే ఇంకేమైనా ఉంటుందా? రచ్చరచ్చై పోదూ! మరి అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ విషయంలో ఇలా జరిగితే ఎలా ఉండాలి సీన్? కానీ దానికి పూర్తిగా విరుద్దంగా జరిగింది..అంతే కాదు పోస్ట్ చేసని ఘనుడికి పంచ్ కూడా పడింది. ఒక నెటిజన్ సమంతతో తనకు పెళ్లైనట్టుగా ఓ పిక్ సృష్టించి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
Related image
అది చూసిన అభిమానులు ‘అభిమానులుగా వారికి ఉంటే చాలు ఇలాంటి ఎదవ పనులు చెయ్యకండి’ అంటూ బాగా ఫైర్ అయ్యారు. ఇలాంటి తిక్క పనులు చేయడం వల్ల సెలబ్రెటీలు ఇబ్బందులు పడతారని ఆ నెటిజన్ కి హెచ్చరికలు చేశారు.  కానీ సమంత మాత్రం సెన్సాఫ్ హ్యూమర్‌ని ప్రదర్శించింది. ‘‘గత వారం పారిపోయాను.. ఇది ఎలా లీక్ అయిందో తెలియట్లేదు.. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’’ అంటూ చమత్కరించింది. ఫైర్ అయిన అభిమానులు కాస్తా.. సామ్ ట్వీట్ చూసి కడుపుబ్బ నవ్వుకోవడం మొదలు పెట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: