టాలీవుడ్ డైరక్టర్లలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న మారుతి మొదట్లో బూతు సినిమాలు తీసినా ఆతరువాత తన పద్ధతి మార్చుకుని తీసిన ‘ప్రేమకథా చిత్రమ్’ ‘భలే భలే మగాడివోయ్’  ‘మహానుభావుడు’ లాంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇలాంటి పరిస్థుతులలో మారుతి సుమంత్ శైలేంద్ర అనే కన్నడ హీరోని టాలీవుడ్ కు పరిచయం చేస్తూ తీసిన ‘బ్రాండ్ బాబు’ మూవీ ఈవారం విడుదల కాబోతోంది. 

భోజనంలో కూరగా తినే వంకాయ నుండి ప్రతి విషయం బ్రాండ్ గా ఉండాలి అని భావించే ఒక అత్యంత ధనవంతుల కుటుంబానికి చెందిన వ్యక్తి ఆఇంటిలో పనిచేసే పనిమనిషి ప్రేమలో పడితే జరిగే విచిత్ర సంఘటనలతో ఈమూవీ ఉండబోతోంది. వాస్తవానికి ఈసినిమాకు దర్శకత్వం వహించింది ఈటివి ప్రభాకర్ అయినా ఈమూవీకి కర్త కర్మ క్రియ అంతా తానై నడిపించాడు మారుతి. 

ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసాడు.  ప్రస్తుత పరిస్థుతులలో బ్రాండ్ కి ఉన్న ప్రయారిటీ హ్యూమన్ ఎమోషన్స్ కి లేదు అని అంటూ యూత్ అంతా బ్రాండ్ కోసమే బతికేస్తున్నారు అంటూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. అంతేకాదు బయట ఎక్కడికివెళ్లినా ఫంక్షన్లకు వెళ్లినా ముందు బ్రాండ్ ఏంటో చూస్తున్నారని తాము ఉపయోగించే బ్రాండ్ ని అందరి ముందు ఉబలాటంగా చూపించేందుకు జనం తహతహలాడుతున్నారు అంటూ మారుతి సంచలన వ్యాఖ్యలు చేసాడు. 
brand-babu
మరో మాటలో చెప్పాలి అంటే నేటితరం చావులో కూడ బ్రాండ్ ను చూస్తోంది అంటూ గొప్పవారి ఇంట్లో మరణాలు సంభవించినప్పుడు పెద్దపెద్ద వాళ్ళు వస్తారు కదా వారి ముందు ఎడ్వకూడదు తాము నాలుగు గోడలమధ్య ఏడ్చింది చాలు అంటూ ఫీల్ అవుతున్న ఎన్నో గొప్ప కుటుంబాలను తాను చూసాను అంటూ మారుతి షాకింగ్ కామెంట్స్ చేసాడు. ముఖ్యంగా అమెరికాలోని తెలుగువారు అక్కడ బ్రాండ్ కి ఇచ్చే ప్రయారిటీని చూసి ఆశ్చర్యపోయాను అంటూ లక్షలు పోసి చెప్పులు ఖరీదైన దుస్తులు కొంటున్న ఈ ట్రెండ్ ను చూసి తాను ‘బ్రాండ్ బాబు’ గా మార్చాను అని అంటున్నాడు. ఈసినిమా సూపర్ హిట్ అవుతుంది అని మారుతి చెపుతున్న అంచనాలను ఎంతవరకు ఈమూవీ చేరుకుంటుందో ఈవారం తేలిపోతుంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: