కొంత కాలంగా నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.  ఇండస్ట్రీలో హీరోయిన్ కావాలని వస్తున్న అమ్మాయిలను దారుణంగా మోసం చేస్తున్నారంటూ కొంత మంది సెలబ్రెటీల ఫోటోలు లీక్ చేస్తున్న నానా హంగామా చేసింది.  అయితే పవన్ కళ్యాన్ ని దూషించడంతో ఆమెపై అటు మీడియా..ఇటు పవన్ ఫ్యాన్స్ ఫైర్ కావడంతో ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యింది.  ఇదిలా ఉంటే ఈ మద్య టాలీవుడ్ వదిలి కోలీవుడ్ పై పడింది.  దర్శకులు లారెన్స్, మురుగదాస్,నటుడు, దర్శకులు సురేందర్ పై కూడా ఆరోపణలు చేసింది.

తాజాగా శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై దర్శకుడు, నటుడు లారెస్స్ స్పందించారు. శ్రీరెడ్డి ఆరోపణలను గురించి అంతా నన్ను అడుగుతున్నారు .. అదే పనిగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దాంతో ఈ వివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నాను. సోషల్ మీడియాలో ఓ ప్రెస్‌నోట్‌ను రిలీజ్ చేసిన ఆయన ఈ ఇష్యూని ఏడు సంవత్సరాల క్రితం ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు.  ఆమె నా హోటల్ రూమ్‌కి వచ్చానని... అప్పుడు నేను ఆమెను మిస్ యూజ్ చేసుకున్నానని తెలిపింది. నా రూమ్‌లో దేవుడి ఫోటో, రుద్రాక్ష మాల కూడా చూశానని ఆమె చెప్పింది.
Related image
హోటల్స్‌లో రుద్రాక్ష మాల పెట్టి పూజలు చేయడానికి నేనేమీ ఫూల్‌ని కాను. నేను శ్రీరెడ్డికి డైరెక్ట్‌గా చెబుతున్నా.. నేనే తప్పూ చేయలేదు ఆ విషయం నాకు తెలుసు.. ఆ భగవంతుడికి తెలుసు. ఓ ప్రెస్ మీట్ పెడతాను.. దానిలో నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు. మీడియా ముందు నీకో క్యారెక్టర్, సీన్ ఇస్తా నటించి చూపించు అలాగే కొన్ని డ్యాన్స్ స్టెప్స్ చూపిస్తా అవి చేసి చూపించు.. నువ్వు నిజంగా టాలెంటెడ్ అయితే నా ఎదుట, ప్రెస్ ఎదుట అవి చేసి చూపించు.
Image result for lawrence sri reddy
నిజంగా నువ్వు బెస్ట్ యాక్టర్‌వి అని నేను ఫీల్ అయితే ఓ డైరెక్టర్‌గా ప్రెస్ ఎదుట నా నెక్ట్స్ మూవీలో నీకో మంచి క్యారెక్టర్ ఇచ్చేందుకు సైన్ చేసి.. అడ్వాన్స్ ఇస్తాను. నేనేమీ తప్పు చేయలేదు కాబట్టి నిన్ను డైరెక్ట్‌గా ఫేస్ చేసేందుకు నేను భయపడట్లేదు.నేను భయపడిన కారణంగా ఈ రిప్లై ఇవ్వట్లేదు నేను మహిళలకు చాలా గౌరవం ఇస్తాను అందుకే నా తల్లికి గుడికట్టి అది మహిళలకు డెడికేట్ చేశాను. నువ్వింత చేశాక కూడా నాకు నీపై కోపం రావట్లేదు. నీ ఇంటర్వ్యూస్‌ అన్నీ చూశాను.. నీపై జాలి కలుగుతోంది నాకు.




మరింత సమాచారం తెలుసుకోండి: