బిగ్ బాస్ మొదటి సీజన్ అందరి అంచనాలకు మించి సక్సెస్ అవగా సెకండ్ సీజన్ చప్పగానే సాగుతుంది అన్నది అందరి మాట. అయితే చూసే ఆడియెన్స్ చూస్తున్నారనుకోండి. బిగ్ బాస్ మొదటి సీజన్ అంత సవ్యంగానే సాగింది. అయితే సెకండ్ సీజన్ లోనే అనుకోని విధంగా కొత్త విధానాలు తెస్తున్నారు.


ముఖ్యంగా ఆల్రెడీ ఆడియెన్స్ ఓట్లతోనే ఎలిమినేట్ చేయగా మళ్లీ అదే ఆడియెన్స్ ఎలిమినేట్ అయిన వారిని ఇంట్లోకి పంపించేలా ఓట్లు వేయడం విశేషం. బిగ్ బాస్ తెలుగులో ఇదో క్రేజీ డెశిషన్ అయితే ఇది కేవలం గేమ్ లో భాగమా లేక షో మీద ఆసక్తి పెంచేందుకు అత్యవసర నిర్ణయమా అన్నది తెలియాల్సి ఉంది.


ఓ పక్క షో టి.ఆర్.పి రేటింగ్స్ మాములుగానే వస్తుండగా నాని మాత్రం 11 కోట్లు ఓటింగ్స్ జరిగాయని చెబుతున్నాడు. ఎలాగోలా శ్యామలా, నూతన్ నాయుడు ఇంట్లో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. అయితే కంటెస్టంట్స్ తో ప్రస్తుతానికి కలవకుండా వారిద్దరిని సీక్రెట్ గా ఉంచాడు బిగ్ బాస్.  


ఆయన ఆర్డర్ ప్రకారమే ఇద్దరు ఒకేసారి ఇంట్లోకి వెళ్తారా లేక ఒక్కొక్కరు ఇంట్లోకి వెళ్తారా అన్నది చూడాలి. లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లిన పూజా కూడా ఇంకా గేం ప్లాన్ వర్క్ అవుట్ చేయట్లేదు. ఇక నిన్న నాని చెప్పిన క్లూ ప్రకారం వచ్చే వారం ఇద్దరు ఇంటి సభ్యులు బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: