హీరోగా కొన్ని సినిమాలు తీసి ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో కూడా కనిపిస్తున్న రాహుల్ రవింద్రన్ మొదటిసారి దర్శకుడిగా మారి చేసిన సినిమా చి.ల.సౌ. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సుశాంత్, రుహాని శర్మ లీడ్ రోల్స్ లో నటించారు. ఆగష్టు 3న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.


ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు అర్జున్ రెడ్డి సినిమాకు సంబంధం ఉందన్న విషయం రివీల్ చేశాడు. అదెలా అంటే ఈ సినిమాకు టైటిల్ గా చి.ల.సౌ అని పెట్టారు. కాని అసలు ఈ సినిమాకు చిరంజీవి అర్జున్ అని టైటిల్ అనుకున్నాడట రాహుల్ రవింద్రన్.


అయితే సినిమాకు టైటిల్ గా అనుకున్న టైంలో అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యిందని అందుకే ఆ సినిమా రిఫరెన్స్ తీసుకున్నట్టు ఉంటుందని రాహుల్ టైటిల్ మార్చినట్టు వెళ్లడించారు. చిలసౌ టీజర్, ట్రైలర్స్ చూస్తె సుశాంత్ ఏ సినిమాకు రాని పాజిటివ్ బజ్ వచ్చిందని చెప్పొచ్చు.


ఈమధ్య అక్కినేని హీరోల సుడి బాగుంది. సుమంత్ మళ్లీరావాతో హిట్ ట్రాక్ ఎక్కేయగా ఇప్పుడు సుశాంత్ చిలసౌతో సత్తా చాటేలా ఉన్నాడు. సినిమా హిట్ అయితే మళ్లీ అక్కినేని ఫ్యామిలీలో ఉత్సాహం రెట్టింపు అవుతుందని చెప్పొచ్చు. అందుకే సినిమాకు అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ గా నిలుస్తున్నారు. ప్రమోషన్స్ లో కూడా ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉందని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: