బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వచ్చిన సినిమా సాక్ష్యం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో నామా అభిషేక్ నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. పంచభూతాల కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట పడకున్నా ఫస్ట్ డే 3.11 కోట్ల కలక్షన్స్ రాబట్టింది.


ఇక రెండో రోజు మూడవ రోజు కలక్షన్స్ కాన్ స్టంట్ గానే వచ్చినట్టు తెలుస్తుంది. 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన సాక్ష్యం మూవీ అంచనాలను అందుకోలేదు. కాని ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను సాధిస్తుంది. ఈ సినిమా మొదటి వారాంతరంలో 8.13 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.


అయితే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 19 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంది. ఈ శుక్రవారం కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఏం తెచ్చినా ఈ శుక్రవారం లోపే సాక్ష్యం తీసుకురావాల్సి ఉంటుంది. పూజా అందాలకు ఫ్యాన్స్ ఎగబడుతున్నా సినిమాకు ఆల్రెడీ బ్యాడ్ టాక్ రావడంతో సినిమా వసూళ్లు తగ్గాయి.


ఇక ఏరియాల వారిగా సాక్ష్యం తొలి వారం కలక్షన్స్.. 
నైజాం : 2.25 కోట్లు
సీడెడ్ : 1.40 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.99 కోట్లు
గుంటూర్ : 0.81 కోట్లు
ఈస్ట్ : 0.49 కోట్లు
వెస్ట్ : 0.37 కోట్లు
కృష్ణా : 0.50 కోట్లు
నెల్లూరు : 0.27 కోట్లు
ఏపి/తెలంగాణ : 7.08 కోట్లు
 
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.85 కోట్లు
ఓవర్సీస్ : 0.20 కోట్లు
వరల్డ్ వైడ్ : 8.13 కోట్లు 



మరింత సమాచారం తెలుసుకోండి: