రాజమౌళి చేస్తున్న మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ పాత్రల గురించి రోజుకో న్యూస్ సంచలనంగా మారుతుంది. మొదట ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా వస్తుందని వార్తలు రాగా లేటెస్ట్ గా ఇదో పిరియాడికల్ సబ్జెక్ట్ తో వస్తున్న సినిమా అని అంటున్నారు.


అంతేకాదు ఇందులో ఎన్.టి.ఆర్ మరోసారి నట విశ్వరూపం చూపిస్తాడని టాక్. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ మన్యం పులి అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తాడని టాక్. అల్లూరిగా నందమూరి హీరో సీనియర్ ఎన్.టి.ఆర్ కలగన్న ఆ పాత్ర ఘట్టమనేని కృష్ణ తెరరూపం దాల్చారు.


అప్పట్లో అదే పెద్ద సెన్సేషన్ అయ్యింది. కృష్ణ తర్వాత అలాంటి పాత్రలో ఎవరు కనిపించడానికి సాహసం చేయలేదు. అయితే ఎన్.టి.ఆర్ అల్లూరిగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. చూస్తుంటే ఇదో స్వాతంత్ర ఉద్యమానికి సంబందించిన కథ అని తెలుస్తుంది. బాహుబలితో ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినా చూపించిన రాజమౌళి ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.  


ఒకవేళ అల్లూరి సీతారామరాజుగా ఎన్.టి.ఆర్ చేస్తే చరణ్ ఏ పాత్రలో నటిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్. అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: