కొత్త దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆర్ ఎక్స్ 100’ మంచి విజయం సాధించింది.  కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు చిత్రాలను బాగా ఆదరిస్తారని ‘ఆర్ ఎక్స్ 100’ తో నిరూపితమైంది.  ఆ మద్య సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిన్న చిత్రమే అయినా దుమ్మురేపే కలెక్షన్లు సాధించింది.  ‘ఆర్ ఎక్స్ 100’ రిలీజ్ అయిన మొదటి రోజు పెద్దగా హిట్ టాక్ రాకపోయినా..మరుసటి రోజు నుంచి ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించ సాగింది.

Related image

కథ పరంగా ఈ సినిమా రెండు ఊర్ల మద్య ఉన్న తగాదా తో పాటు లవ్, సెంటిమెంట్ ఉండటంతో బిసి సెంటర్లో బాగా కనెక్ట్ అయ్యింది.   చిన్న సినిమాగా వచ్చి రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం 3 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమాకు ఇప్పటికే 12కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని ఫిలింనగర్ టాక్. ఏడాది టాప్ 5 హిట్ చిత్రాల్లో ‘ఆర్ ఎక్స్ 100’ ఒకటి అని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

Image result for rx 100 movie hot pics

తాజాగా ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి  ఓ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రం యూనిట్. ‘అదిరే హృదయం’ పేరుతో విడుదలైన ఈ హాట్ హాట్ సాంగ్ యువతను పిచ్చేక్కిస్తోంది. ఈ వీడియోలో   లిప్ లాక్ కిస్ లే ఉన్నాయి..శృంగార సన్నివేశంగా సాగే ఈ పాట  ఇప్పటికే 4.60 లక్షల మందికి పైగా చూశారు. రికార్డు స్థాయి క్లిక్స్ తో నెటిజన్లు మోత మోగిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: