పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అయినా ఆయన గతంలో నటించిన సినిమాల గురించి అతడి అభిమానులు హడావిడి చేస్తూనే ఉన్నారు. పవన్ కెరియర్ కు ఒక టర్నింగ్ పాయింట్ గా మారిన ‘తొలిప్రేమ’ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆసినిమాలో నటించిన నటీనటులతో దర్శకుడితో మీడియా ఇంటర్వ్యూలు చేస్తూ అలనాటి ‘తొలిప్రేమ’ విషయాలను ఇప్పుడు మళ్ళీ గుర్తుకు చేస్తోంది. 
గంటల తరబడి
ఇలాంటి పరిస్థుతులలో ‘తొలిప్రేమ’ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి ఆతరువాత ఎక్కువ సినిమాలు చేయకపోయినా పవన్ అభిమానులకు ఇప్పటికీ బాగా గుర్తుండిపోయింది. ఈసినిమా షూటింగ్ సమయంలోనే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో పరిచయం పెంచుకుని ఆపరిచయం ప్రేమగా ఆతరువాత పెళ్ళిగా మార్చుకున్న వాసుకి అలనాటి తన ప్రేమ విషయాలను అప్పట్లో పవన్ తనకు చెప్పిన వేదాంత పాఠాలను గుర్తుకు చేసుకుంటూ అనేక ఆసక్తికర విషయాలను ఒక మీడియా ఇంటర్వ్యూలో వివరించింది. 
కనిపెట్టలేకపోయా
‘తొలిప్రేమ’ షూటింగ్ సమయంలో తనకు ఆనంద సాయితో ఏర్పడ్డ పరిచయాన్ని వివరిస్తూ ఆసినిమా షూటింగ్ లో తమ మధ్య ఏర్పడ్డ పరిచయంతో సరదాగా గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అప్పట్లో తమ మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారుతుందని తాను ఊహించలేదు అని అంటోంది వాసుకి. తమ మధ్య సినిమా సంగతులు మాత్రమే కాకుండా ప్రేమ కూడ ఏర్పడింది అన్న విషయం అప్పట్లోనే పవన్ పసికట్టాడు అంటూ పవన్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు చేసుకుంది. 
స్నేహితుడిగా ఉండలేను
పవన్ కళ్యాణ్ తనకు ఇప్పటికీ  చాలామంచి స్నేహితుడు అని అంటూ పవన్ కళ్యాణ్ ఎంత సరదాగా ఉంటారో అంతే ఫాలాసఫీ కూడా చెప్పిన విషయాన్ని బయటపెట్టింది వాసుకి. అయితే తనకు అప్పటికి 18 ఏళ్ళు మాత్రమే ఉండటంతో పవన్ చెప్పే ఫిలాసఫీ తనకు ఎక్కేది కాదు అని అంటూ అప్పుడు పవన్ చెప్పిన విషయాలు ఇప్పుడు తనకు గుర్తుకు వస్తున్నాయి అంటూ అప్పటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంది పవన్ చెల్లెలు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: